Prabhas Project K: దేశంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ప్రాజెక్ట్ కే. దర్శకుడు నాగ్ అశ్విన్ దీన్ని పాన్ వరల్డ్ మూవీగా ప్రకటించి అంచనాలు మరింతగా పెంచేశాడు. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొంత భాగం షూటింగ్ జరిగింది. ఇటీవల ప్రాజెక్ట్ కే మూవీపై ఒక పుకారు చెలరేగింది. శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం చిత్ర కథకు ప్రాజెక్ట్ కే స్టోరీ లైన్ దగ్గరగా ఉంటుందట. ప్రాజెక్ట్ కే కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందట. ఒకే ఒక జీవితం చూశాక నాగ అశ్విన్ అప్ సెట్ అయ్యాడనేది సదరు కథనాల సారాంశం.

ఈ పుకార్ల పై నాగ అశ్విన్ స్పందించారు. ఆయన రూమర్స్ ని ఉద్దేశిస్తూ ఘాటైన సెటైర్ వేశాడు. పారడైజ్ వద్ద బస్సు దిగినవారంతా అక్కడ బిర్యానీ తినడానికని అర్థం కాదన్నారు. ప్రాజెక్ట్ కే పై వస్తున్న పుకార్లు అర్థరహితమని కొట్టిపారేశారు. నిన్న అమితాబ్ బర్త్ డే నేపథ్యంలో ప్రాజెక్ట్ కే నుండి ఆయన ప్రీ లుక్ విడుదల చేశారు. ప్రీ లుక్ చూస్తే పీరియాడిక్ ఎపిసోడ్ కి సంబంధించిందని అనిపిస్తుంది.
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ అంటే పెద్ద బిల్డింగ్స్ ,మెషిన్స్ తో కూడిన విజువల్స్, స్టిల్స్ ఉంటాయి. నిన్న విడుదల చేసిన లుక్ పీరియాడిక్ బ్యాక్ గ్రౌండ్ ని తలపిస్తుంది. ఈ క్రమంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ప్రాజెక్ కే తెరకెక్కుతున్న మాట వాస్తవమే కావచ్చనిపిస్తుంది. టైం మెషిన్ లో భవిష్యత్ తో పాటు గతంలోకి కూడా వెళ్లొచ్చు. అమితాబ్ అలాంటి పీరియాడిక్ పాత్ర చేస్తున్నారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే అసలు విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాలి. నిజంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ లో తెరకెక్కినా కథా, నేపథ్యం వేరు కావచ్చు. ఇక ప్రభాస్ కి జంటగా ఈ మూవీలో దీపికా పదుకొనె నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్ గా నటించడం విశేషం.