Mohan Babu : సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంటారు. అయితే విలక్షణ నటనతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మోహన్ బాబు ఒకరు. ఇక కెరియర్ మొదట్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు…
ఒకప్పుడు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతూ వచ్చిన మోహన్ బాబు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆయన చేయలేని పాత్ర అనేది ఏదీ లేదు అనేలా తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు మాత్రం తన పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు డౌన్ ఫాల్ అవుతున్నాడనే చెప్పాలి. ఇక తన కొడుకులను హీరోలుగా నిలబెట్టడంలో ఫెయిల్ అయిన మోహన్ బాబు ఇప్పుడు కుటుంబ విషయాలను రోడ్డుమీదకి తీసుకొచ్చి మరింత దిగజారుతున్నారనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఈ ఏజ్ లో ఇలా చేయాల్సింది కాదు అంటూ పలువురు మోహన్ బాబు మీద కొంతవరకు విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం మోహన్ బాబు యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి వచ్చిన మీడియా వ్యక్తుల మీద మోహన్ బాబు దాడి చేశాడు. ఇక దాంతో రాచకొండ సీపీ సుదీర్ బాబు మోహన్ బాబు కి నోటీసులు అయితే జారి చేశారు. రేపు ఉదయం 10:30 కి పోలీస్ స్టేషన్ కు రావాలని సిపి సుధీర్ బాబు తెలియజేశారు.
ఇక దాంతోపాటు మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ పరిస్థితులు ఇలా ఉండడం మీడియా దాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసి న్యూస్ లు రాస్తుందనే ఒకే ఒక కారణంతో మోహన్ బాబు మీడియా మీద దాడి చేశాడు అంటూ తన సన్నిహితుల నుంచి కొన్ని సమాధానాలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా నలుగురికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి అయిన మోహన్ బాబు ఇలా తన బిడ్డలతో గొడవలు పెట్టుకొని మీడియా మీద దాడి చేయడం అనేది సరైన విషయం అయితే కాదు. తన ఏజ్ కు తగ్గట్టుగా బిహేవ్ చేసి ఉంటే బాగుండేది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఇంతకు ముందు మోహన్ బాబు లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో లేడని గుర్తు పెట్టుకున్నారు.
ఇక అలాంటి జనాలకి మోహన్ బాబు మీడియాతో తన కొడుకులతో ఎలా బిహేవ్ చేస్తాడు ఆయన క్యారెక్టర్ ఏంటి అంటూ నలుగురు మాట్లాడుకునే స్థాయికి దిగజారడం అనేది అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు… ఇక ప్రస్తుతం మోహన్ బాబు కి కొంచెం అస్వస్థత గా ఉండడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు…