The Paradise Movie Story: ప్రస్తుతం పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజైన సగటు ప్రేక్షకులందరు చూసి ఆ సినిమా మీద వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అందుకోసమే ప్రతి స్టార్ హీరో సైతం కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక కథ ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఉన్నప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఎలాంటి మ్యాజిక్కులు లేకుండా ముందు కథ విన్న తర్వాతే వాళ్ళ డిసీజన్స్ ఏంటి అనేది చెప్పేస్తున్నారు. ఒకప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం దర్శకులను నమ్మి సినిమాలను చేసేవాడు. అది ‘శ్రీమంతుడు’ సినిమా వరకు బాగానే వర్కౌట్ అయింది. కానీ ఆ తర్వాత ‘బ్రహ్మోత్సవం’ సినిమా బెడిసి కొట్టింది. దాంతో ఆయన పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాతే సినిమాకి డేట్స్ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అందుకే ఇప్పుడు అతని దగ్గరికి వచ్చిన ప్రతి దర్శకుడితో బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెబుతున్నాడు… ఇక ఆయన బాటలోనే నాని కూడా నడుస్తున్నాడు. టైర్ 2 హీరోల్లో నాని నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. దాంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి సందర్భంలోనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసర మూవీ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి శ్రీకాంత్ డైరెక్షన్ లోనే ‘ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాడు…ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్యారడైజ్ సినిమా ఎలా ఉండబోతోంది. ఆ సినిమా వరల్డ్ ఏంటి అనేది చూపించాడు.
దానిమీద కొంతమంది కొన్ని విమర్శలను చేసినప్పటికి ఓవరాల్ గా ప్రేక్షకులందరికి ఆ గ్లింప్స్ బాగా కనెక్ట్ అయింది. దాంతో సినిమా మీద అంచనాలు తార స్థాయికి చేరిపోయాయి. గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి మోహన్ బాబు పోస్టర్ ను రిలీజ్ చేశారు. అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది.
నిజానికి ఈ సినిమా కథ ఏంటి మోహన్ బాబు చేత విలన్ క్యారెక్టర్ ను చేయిస్తున్నాడు అంటే శ్రీకాంత్ ఓదెల మామూలోడు కాదు. ఏదో కొత్తరకం కథ ఉంటే తప్ప మోహన్ బాబు అయితే ఒప్పుకోడు. కాబట్టి ఈ సినిమా కథ ఏంటి అనే దూరంలో కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హైదరాబాదులో ప్యారడైజ్ అనే ఒక ఏరియా ఉంటుంది.
అందులో మల్లి అనే ఒక వేశ్య కి జడల్(నాని) పుడతాడు… తర్వాత రోజుల్లో కొంతమంది అధికార దాహంతో రెడ్ లైట్ ఏరియాలో బతుకుతున్న వాళ్ల మీద దాడులు చేయిస్తారు.ఇక అక్కడి నుంచి వాళ్ల టీమ్ మొత్తాన్ని ఏకం చేసి జడల్ ఆ అధికారులను గల ఎదిరించాడు. అలాగే ఈ రెడ్ లైట్ ఏరియాను వాడుకొని అందులో ఉన్న మహిళలను తన గుప్పిట్లో పెట్టుకొని కొన్ని ఇల్లీగల్ పనులు చేయిస్తున్న ‘శికంజా మల్లిక్’ (మోహన్ బాబు) మీద జడల్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ…