Rajamouli : చాలా మంది దర్శకులు హీరోలను పెట్టి సూపర్ సక్సెస్ లను కొడుతుంటే హీరోలతో అవసరం లేదని ఈగను పెట్టి కూడా సినిమా చేయచ్చు సక్సెస్ ఫుల్ గా నిలుపవచ్చు అని ఒక ఛాలెంజ్ ను తీసుకున్నాడు. ఈగతో సినిమాను చేసి ఆ సినిమాను విజయ వంతంగా నిలిపిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు(Mahesh Babu) తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఆయన ఇమేజ్ తారా స్థాయిలోకి వెళ్ళిపోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి పాపులారిటిని సంపాదించుకున్నాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఆయన లాంటి దర్శకుడు దొరకడం ఇండియన్ సినిమాకి ఒక వరం అనే చెప్పాలి. ఇక జేమ్స్ కామెరూన్ (cameroon) లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దర్శకుల పక్కన ఆయన పేరు ను నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో ఆయన చాలా కసరత్తులు చేస్తూ మరి ఆ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటికి ఆ సినిమా ఎక్కడ షూట్ జరుగుతుందనేది మాత్రం రాజమౌళి ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ముందుకు సాగుతుంది…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి కెరియర్ మొదట్లో చేసిన కొన్ని సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కి ఆ ఒక్క సినిమా అంటే నచ్చదట.
ఇంతకీ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలకు నచ్చని సినిమా ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమానట… ఆ సినిమాలో హీరో జైల్లో ఉండి ఎల్ ఎల్ బి కంప్లీట్ చేస్తాడు. అది ఎందుకో ఈ ఇద్దరు హీరోలకి అంత పెద్దగా కనెక్ట్ కాలేదట. ఇక మొత్తానికైతే రాజమౌళి ప్రభాస్ తోనే ఈ సినిమాని చేయాలనుకున్నాడట.
కానీ ప్రభాస్ కి కథ నచ్చకపోవడం వల్ల ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సి వచ్చింది. ఇక రామ్ చరణ్ కి కూడా ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు. స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలకి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆ ఒక్క సినిమా నచ్చకపోవడం అనేది యాదృచ్ఛకమనే చెప్పాలి..