https://oktelugu.com/

Bigg Boss Telugu 9 : ‘బిగ్ బాస్ 9 తెలుగు’ ఇంత తొందరగా ప్రారంభం కాబోతుందా..? షాకింగ్ అప్డేట్ లీక్ చేసిన నాగార్జున!

ప్రతీ ఏడాది మన తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 21, 2024 / 07:57 AM IST

    Nagarjuna

    Follow us on

    Bigg Boss Telugu 9 : ప్రతీ ఏడాది మన తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో మన అందరికీ తెలిసిందే. సీజన్ 7 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో, అందరూ సీజన్ 8 పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను ఈ సీజన్ అందుకోలేకపోయినప్పటికీ, పర్వాలేదు అనే రేంజ్ లో రెస్పాన్స్ ని సంపాదించుకుంది. ఓటీటీ లో రెండవ సీజన్ ని ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. బిగ్ బాస్ టీం కూడా ప్లానింగ్ చేసింది. కానీ ఎందుకో మధ్యలోనే ఆ ఆలోచనని విరమించుకుంది. కానీ ఓటీటీ సీజన్ కాకుండా, మెయిన్ సీజన్ ని అతి తొందరగా ప్రారంభించే ఆలోచనలో ఉందట బిగ్ బాస్ టీం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుండే మొదలు పెట్టారట. సాధారణంగా బిగ్ బాస్ సీజన్స్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో ముగుస్తాయి.

    కానీ ఈ సీజన్ ని మాత్రం మార్చి నెలలో ప్రారంభించాలని అనుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం చర్చల దశలోనే ఉందట. మరో నెల రోజుల్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం సీజన్ 8 లో జరిగిన పొరపాట్లు రిపీట్ చేయకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముందుగా బిగ్ బాస్ టీం మొత్తాన్ని ప్రక్షాళన చేయడానికి చూస్తున్నారట. సీజన్ 7 కి పనిచేసిన యూనిట్ మొత్తం మారిపోయిందట. మమ్మల్ని శాశ్వత ఉద్యోగస్తులుగా చెయ్యమని అడిగితే బిగ్ బాస్ యాజమాన్యం అందుకు ఒప్పుకోలేదట. దీంతో వాళ్లంతా పని చేయడం ఆపేసరికి కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకుంది బిగ్ బాస్ టీం. ఆ కొత్త టీం కారణంగానే ఈ సీజన్ అంచనాలను అందుకోలేకపోయింది. ఒక్కసారి ఊహించుకోండి వైల్డ్ కార్డ్స్ లేకపోతే ఈ సీజన్ ఎంత దారుణంగా ఉండేదో. సీజన్ 6 కంటే పెద్ద డిజాస్టర్ అయ్యేది.

    అలా డిజాస్టర్ అవ్వకుండా వైల్డ్ కార్డ్స్ కాపాడారు. ఈ సీజన్ లో టాస్కులు కూడా అనుకున్న రేంజ్ లో లేవు. స్టార్ మా పరివారం లో పెట్టే టాస్కులు ఇంకా బెటర్ గా అనిపించింది. అంత వీక్ టాస్కులు పెట్టారు. అంతే కాకుండా ఈ సీజన్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోవడానికి మరో కారణం క్లాన్ కాన్సెప్ట్స్ . సాధారణంగా గ్రూప్ గేమ్స్ అనేవి ఆడియన్స్ నచ్చరు, అలాంటిది ఏకంగా బిగ్ బాస్ అధికారికంగా గ్రూప్ గేమ్స్ ఆడడం మొదలు పెట్టడంతో ఆడియన్స్ లో నెగటివిటీ ఏర్పడింది. అలా కర్ణుడు చావుకి లక్ష కారణాలు అన్నట్టు, ఈ సీజన్ అంచనాలను అందుకోలేకపోవడానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని, కేవలం తెలుగు ఆర్టిస్టులతోనే సీజన్ ని మొదలు పెట్టబోతున్నారట. సీజన్ మొత్తం ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న వాళ్లనే తీసుకోబోతున్నారట. అంతే కాకుండా పాత సీజన్స్ కి పని చేసిన టీం ని మళ్ళీ వెనక్కి తీసుకొని రాబోతున్నారట. ఈసారైనా బిగ్ బాస్ టీం అంచనాలు అందుకునే స్థాయికి రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.