Sankranthi Race 2027: సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వచ్చిందంటే చాలు సినిమాల హవా పెరిగిపోతుంది. ప్రేక్షకులు సైతం పండక్కి తమ ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ సంక్రాంతి సీజన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఐదు సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం… అందులో నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ అయితే ఒక సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రాజాసాబ్ సినిమా డిజాస్టర్ అయింది. మిగతా సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి. ఇక సంక్రాంతి సీజన్ లో హీరోలతో సంబంధం లేకుండా కుర్ర హీరోలు సైతం వచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సంక్రాంతి సీజన్ మీదనే కన్నేస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో కంటెంట్ బాగుంటే సరిపోతుంది అనే ఉద్దేశ్యంతో ఇప్పుడున్న యంగ్ హీరోలు సంక్రాంతి సినిమాలను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.
2027 సంక్రాంతి సీజన్ కి ఇప్పటికే శర్వానంద్ తన సినిమాని రిలీజ్ చేస్తున్నాను అంటూ అనౌన్స్ చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ చేయబోతున్న సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి వెళ్లబోతుంది. దాంతో ఈ సినిమాని ముందుగానే సంక్రాంతి బరిలో నిలిపేందుకు క్లారిటీ అయితే ఇచ్చారు…ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు మరికొంతమంది యంగ్ హీరోలు సైతం బరిలో నిలవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ లెక్కన స్టార్ హీరోలు కుర్ర హీరోలు అనే తేడా లేదు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్స్ సైతం సంక్రాంతి సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసం చేస్తున్నారు. ఒకవేళ సినిమా క్లిక్ అయితే మాత్రం భారీ వసూళ్లను కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ తేడా కొట్టిన కూడా ఆ సినిమా ఎంతో కొంత రికవరీ చేసే అవకాశం ఉంది. కాబట్టి సంక్రాంతిని నమ్ముకోవడమే బెటర్ అనే విధంగా మేకర్స్ అయితే ముందుకు సాగుతున్నారు… వచ్చే సంక్రాంతికి శర్వానంద్ తన సినిమాను కన్ఫర్మ్ చేశాడు. ఇక తనతో పాటు పోటీలో నిలిచే వారెవరో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
