HomeతెలంగాణCongress : కాంగ్రెస్ గెలుపు స్కెచ్.. కీలకమైన ఆ రెండు బలమైన వర్గాలకు గాలం

Congress : కాంగ్రెస్ గెలుపు స్కెచ్.. కీలకమైన ఆ రెండు బలమైన వర్గాలకు గాలం

Congress : కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. తెలంగాణ ఇచ్చినా రెండు సార్లు నాయకత్వ లోపంతో అధికారానికి దూరమైంది. కానీ ఈసారి కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంతో తెలంగాణలో జెండా పాతడానికి రెడీ అవుతోంది. ఓవైపు రేవంత్.. మరో వైపు భట్టి సహా నేతలంతా ఖమ్మం సభలో ఏకతాటిపైకి వచ్చి ఐక్యత చాటారు. గెలుపు కోసం ఏకమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కు దూరమైన అన్ని వర్గాలను ఏకం చేయాలని కాంగ్రెస్ స్కెచ్ గీసింది.

తెలంగాణలో సెటిలర్స్ సంఖ్య గణనీయంగా ఉంది. బీఆర్ఎస్ పాలనలో వారికి గుర్తింపే లేదు. ఓట్ల కోసం తప్ప, వారిని పలకరించే వారు లేరు. కాంగ్రెస్ ఇప్పుడు కొత్త వ్యూహం సిద్ధం చేస్తుంది. సెటిలర్స్ కు వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమ సమస్యలపైన కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. సెటిలర్స్ తో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన వారికి టకెట్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. హైదరాబాద్ కి సినీ పరిశ్రమను తీసుకొచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకొస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సెటిలర్లు..సినీ పరిశ్రమకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ లెక్క మూమూలుగా లేదు. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకు టికెట్లు ఇవ్వాలని ఈ మేరకు డిసైడ్ అయ్యింది. అదే సమయంలో మంత్రివర్గంలోనూ స్థానం కల్పించాలని యోచిస్తోంది. తెలంగాణలో పదేళ్లుగా వివక్షకు గురవుతున్న సెటిలెర్లకు ప్రాధాన్యత దిశగా ఇప్పుడు కీలక అడుగులు వేస్తుంది. ఈ సమయంలో కాంగ్రెస్ మరోసారి సినీ పరిశ్రమపైన దృష్టి సారించింది. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలోనే పరిశ్రమకు అవసరమైన భూములు, రాయితీలు, ప్రోత్సాహకాలతో అండగా నిలిచింది. దీనిని ఇప్పుడు తిరిగి కొనసాగించేలా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది.

సినీ ఇండస్ట్రీకి టికెట్ల కేటాయింపుతో పాటుగా మంత్రివర్గంలోనూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. పరిష్కారం కాకుండా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న సినీ కార్మికుల ఇళ్ల స్థలాల విషయంలోనూ కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికై అభిప్రాయ సేకరణ, ఏ ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా స్థలాలు అందించే కార్యాచరణ పైన కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ చేస్తున్న ఆలోచన గురించి సమాచారం అందుకున్న సినీ ప్రమఖులు ఇప్పుడు పార్టీ నాయకత్వంతో టచ్ లోకి వస్తున్నారు. సినీ పరిశ్రమ గురంచి చేస్తున్న ఆలోచనతో వారి చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version