https://oktelugu.com/

Game Changer: ‘బుక్ మై షో’ యాప్ లో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమా అదే..ఫ్లాప్ టాక్ తో ‘గేమ్ చేంజర్’ కి ఇన్ని టికెట్స్ సేల్ అయ్యాయా?

ఇంతకు ముందు లాగా కుకుండా గత ఏడాది నుండి బుక్ మై షో యాప్ లో ఏ సినిమాకి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోతున్నాయి??, గంటకి ఎన్ని టికెట్స్ సేల్ అవుతున్నాయి?, 24 గంటల్లో అమ్ముడుపోయిన టికెట్స్ ఎన్ని అనేది తెలిసిపోతున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన చిత్రం ఏమిటో ఒకసారి చూద్దాం. 'గేమ్ చేంజర్' చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 16, 2025 / 08:16 PM IST
    Game Changer Collection

    Game Changer Collection

    Follow us on

    Game Changer: ఈ సంక్రాంతి కానుకగా ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ మరియు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు విడుదల అవ్వగా, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఆ తర్వాత బాలయ్య బాబు హీరో గా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రానికి సూపర్ హిట్ టాక్, మొన్న విడుదలైన వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. ఇంతకు ముందు లాగా కుకుండా గత ఏడాది నుండి బుక్ మై షో యాప్ లో ఏ సినిమాకి ఎన్ని టికెట్స్ అమ్ముడుపోతున్నాయి??, గంటకి ఎన్ని టికెట్స్ సేల్ అవుతున్నాయి?, 24 గంటల్లో అమ్ముడుపోయిన టికెట్స్ ఎన్ని అనేది తెలిసిపోతున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన చిత్రం ఏమిటో ఒకసారి చూద్దాం. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది.

    ఆ టాక్ ప్రభావం చాలా బలంగా పడుతుంది, బుక్ మై షో టికెట్ సేల్స్ కూడా బాగా తగ్గుతాయేమో అని అనుకున్నారు. కానీ ఆరు రోజుల్లో ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ ద్వారా 20 లక్షల 11 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. కేవలం బుక్ మై షో కాకుండా రీసెంట్ గానే డిస్ట్రిక్ట్ యాప్ అని ఒకటి వచ్చింది. అందులో కూడా ఈ సినిమాకి రెండు మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద ఆన్లైన్ ద్వారా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి 40 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అన్నమాట. ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ ట్రెండ్ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి టికెట్స్ అమ్మకం విషయం లో ‘గేమ్ చేంజర్’ చిత్రానిది మొదటి స్థానం.

    ఇక రెండవ స్థానం లో వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం నిల్చింది. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో నిల్చిన ఈ చిత్రానికి కేవలం రెండు రోజుల్లోనే బుక్ మై షో యాప్ లో 10 లక్షల 14 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మొదటి వారంలో గేమ్ చేంజర్ చిత్రాన్ని భారీ రేంజ్ లో దాటే అవకాశం ఉంది. అలాగే డిస్ట్రిక్ట్ యాప్ లో సేల్ అయినా టికెట్స్ కూడా కలిపితే మరో 10 టికెట్స్ కౌంట్ లోకి వస్తాయని. మొత్తం మీద రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రానికి నాలుగు రోజుల్లో 10 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఫుల్ రన్ లో ఈ చిత్రం ‘గేమ్ చేంజర్’ ని అందుకోవడం అసాధ్యమే. అలా ఈ మూడు చిత్రాల్లో ప్రస్తుతానికి ఫ్లాప్ టాక్ మీద నడుస్తున్న ‘గేమ్ చేంజర్’ చిత్రానికే ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుపోయాయి.