https://oktelugu.com/

Gabbar Singh Re Release : విడుదలకు ముందే ‘మురారి’ రీ రిలీజ్ ఫుల్ రన్ అవుట్..’గబ్బర్ సింగ్’ మేనియా తో ఊగిపోతున్న తెలుగు రాష్ట్రాలు!

ఈ సినిమా కేవలం నార్త్ అమెరికా నుండి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఒక్క రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు రాకపోవడం గమనార్హం.

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 04:46 PM IST

    Gabbar Singh Re Release

    Follow us on

    Gabbar Singh Re Release : పవన్ కళ్యాణ్ అభిమానులకు రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఎంత సరదానో ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ కి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది. ఎంత టార్గెట్ ఇచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రికార్డ్స్ బద్దలు కొట్టగలం అని గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో మరోసారి నిరూపించారు పవర్ స్టార్ అభిమానులు. ప్రపంచవ్యాప్తంగా 5 రోజుల అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవ్వగా, కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లో నిన్న మొన్నటి వరకు రికార్డ్స్ కొడుతామా లేదా అనే భయం అభిమానుల్లో ఉండేది. ఎందుకంటే ఓవర్సీస్ నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

    ఆ స్థాయిలో దుమ్ములేపుతున్న సినిమా ఉన్నప్పుడు పాత సినిమా ‘గబ్బర్ సింగ్’ ని ఎవరు చూస్తారు అంటూ సోషల్ మీడియా లో ట్వీట్స్ కూడా వేశారు. కానీ మొదటి రోజు ప్రారంభం కాకముందే అక్కడ ఈ సినిమా 50 వేళ డాలర్ల మార్కును దాటి సంచలనం సృష్టించింది. షోస్ మొత్తం పూర్తి అయ్యేలోపు ఈ సినిమా కేవలం నార్త్ అమెరికా నుండి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఒక్క రీ రిలీజ్ చిత్రానికి కూడా ఈ స్థాయి వసూళ్లు రాకపోవడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం ఇక్కడ 60 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇదే ప్రస్తుతం రీ రిలీజ్ చిత్రాలలో ఆల్ టైం రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు ని గబ్బర్ సింగ్ చిత్రం డబుల్ మార్జిన్ తో దాటబోతుంది. కర్ణాటక, చెన్నై, గుజరాజ్, పంజాబ్, ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాలలో కూడా ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఈ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ‘మురారి’ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 5 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    మొన్నటి వరకు ఇదే ఆల్ టైం రికార్డు, ఇప్పుడు ఆ రికార్డు ని ‘గబ్బర్ సింగ్’ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తో దాటేయడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ‘గిల్లీ’ మొదటి రోజు వసూళ్లను అధిగమించి ఆల్ టైం ఇండియన్ రికార్డుని నెలకొల్పబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబోతున్నాయట. మరి ఆ స్థాయి వసూళ్లు వస్తాయా లేదా అనేది మరికాసేపట్లో తేలనుంది.