Raghu Rama Krishna Raju on DSP: ఏపీలో( Andhra Pradesh) ఒక అంశం హాట్ టాపిక్ అవుతోంది. నిన్న రోజంతా భీమవరం డిఎస్పి జయ సూర్య వార్తల్లో నిలిచారు. ఆయన విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం ఈ ప్రచారానికి కారణం. కూటమినేతల పేర్లు చెప్పుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ డీఎస్పీ జయ సూర్య పై అనేక రకాల ఫిర్యాదులు వచ్చాయి. భీమవరం పరిధిలో పేకాట శిబిరాలకు అండగా నిలుస్తున్నారని.. సివిల్ కేసుల్లో తల దూర్చుతున్నారని ఆయనపై వచ్చిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ ని ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఇదే విషయాన్ని హోం శాఖ మంత్రితో పాటు బిజెపి కార్యాలయానికి సైతం సమాచారం అందించాలని పవన్ డిప్యూటీ కార్యాలయ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై మాట్లాడారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు.
కూటమి ఎమ్మెల్యే మద్దతు..
గన్నవరం డిఎస్పీగా ఉండేవారు జయసూర్య( DSP Jayasurya). అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత ప్రదర్శించే వారని ఆయన పై ఆరోపణలు ఉన్నాయి. ఓ కూటమి ఎమ్మెల్యే మద్దతుతో ఆయన భీమవరం లో పోస్టింగ్ ఇప్పించుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ డీఎస్పీని ఓ కూటమి ఎమ్మెల్యే అండదండగా నిలుస్తున్నారని ఒక టాక్ అయితే ఉంది. సరిగ్గా ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజు స్పందించడం గమనార్హం. మరోవైపు పవన్ కళ్యాణ్ ఫిర్యాదుతో సీఎం చంద్రబాబు సైతం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలని డిజిపి హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. మరోవైపు హోం మంత్రిత్వ శాఖ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం ఏమిటి అన్న ప్రశ్న వస్తోంది. ఆయన కేవలం హోదా ప్రకారమే డిప్యూటీ సీఎం కానీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాలు ఫైనల్ అని.. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తున్నారని విలేకరులు హోంమంత్రి వంగలపూడి అనితను ప్రశ్నించారు. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది ఎన్డీఏ ప్రభుత్వమని.. అంతా సమాచారం తమ వద్ద ఉందని.. శాఖల మధ్య సమన్వయం కొనసాగుతోందని చెప్పారు.
మంచి ట్రాక్ రికార్డ్
తాజాగా దీనిపై స్పందించారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు( deputy speaker raghuramakrishna Raju ). భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు. తనకున్న సమాచారం ప్రకారం జిల్లాలో పేకాట పై ఆయన నిఘా పుట్టారని.. అందుకే ఆయనపై అభియోగాలు వస్తున్నాయని అనుకుంటున్నాట్లు తెలిపారు. తన నియోజకవర్గం నుండి పరిధిలో ఎలాంటి పేకాట స్థావరాలు లేవని.. జూదం పై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని తెలిపారు. తద్వారా రఘురామకృష్ణం రాజు భీమవరం డిఎస్పి కి క్లీన్ చీట్ ఇచ్చినట్లు అయింది. ఈ పరిణామం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.