Devara Collection: ‘దేవర’ 25 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ గ్రాస్!

పక్కన పెడితే 25 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాం. ముఖ్యంగా చాలా కాలం నుండి వసూళ్లు లేక డీలా పడిన ఆంధ్ర ప్రదేశ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి దేవర పుణ్యామా అని మహర్దశ పట్టింది అని చెప్పొచ్చు. మాస్ సెంటర్స్ లో ఇప్పటికీ రోజు లక్ష రూపాయలకు పైగా గ్రాస్ ని రాబడుతుంది.

Written By: Vicky, Updated On : October 22, 2024 5:24 pm

Devara

Follow us on

Devara Collection: నిన్న గాక మొన్న విడుదల అయ్యినట్టు అనిపిస్తున్న ‘దేవర’ చిత్రం అప్పుడే 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈమధ్య కాలం లో ఒక సినిమాకి రెండు వారాల థియేట్రికల్ రన్ రావడమే మహాప్రసాదం లాగా మారింది. అలాంటిది ఎన్టీఆర్ దేవర చిత్రం ఇప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. నైజాం, కర్ణాటక,ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా లో థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసిపోయింది కానీ, ఆంధ్రలో మాత్రం ఈ చిత్రం ఇప్పటికీ మంచి గ్రాస్ వసూళ్లను రాబడుతూనే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సీడెడ్ మరియు గుంటూరు ప్రాంతాలలో థియేట్రికల్ రన్ మామూలు రేంజ్ లో లేదు. మొన్న ఆదివారం కూడా ఈ సినిమాకి కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అంటే, రన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇదంతా పక్కన పెడితే 25 రోజులకు గాను ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ప్రాంతాల వారీగా వివరంగా చూద్దాం. ముఖ్యంగా చాలా కాలం నుండి వసూళ్లు లేక డీలా పడిన ఆంధ్ర ప్రదేశ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి దేవర పుణ్యామా అని మహర్దశ పట్టింది అని చెప్పొచ్చు. మాస్ సెంటర్స్ లో ఇప్పటికీ రోజు లక్ష రూపాయలకు పైగా గ్రాస్ ని రాబడుతుంది. అలాగే ప్రాంతాల వారీగా చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, జీఎస్టీ తో కలిపి చూస్తే 52 కోట్ల రూపాయిలు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. సీడెడ్ ప్రాంతం లో 25 రోజులకు 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఉత్తరాంధ్ర ప్రాంతం 15 కోట్ల 50 లక్షల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 9 కోట్ల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 12 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 9 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 5 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 133 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. రిటర్న్ జీఎస్టీ తో కలిపి చూస్తే 144 కోట్ల రూపాయిలు ఉంటుంది. అలాగే కర్ణాటక లో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళనాడు లో 3 కోట్ల రూపాయిలు, కేరళలో కోటి రూపాయిలు, నార్త్ ఇండియాలో 24 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 25 రోజులకు గాను 213 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ లెక్కలోకి చూస్తే 410 కోట్ల రూపాయిలు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అలాగే ఈ సినిమాకి 25వ రోజు దాదాపుగా 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.