Hari Hara Veeramallu OTT Release: జులై 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిల్చిన చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) కాంబినేషన్ లో ఈ సినిమా మొదలైంది. ఆ తర్వాత కరోనా రావడం, సినిమా ఆగిపోవడం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, క్రిష్ ఎదురు చూడలేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వంటివి ఈ సినిమా బజ్ ని పూర్తి గా జీరో ని చేశాయి. మళ్ళీ జీరో నుండి అంచనాలు పెంచడం లో దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన జ్యోతి కృష్ణ తీవ్రంగా విఫలం అయ్యాడు. సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తాన్ని మార్చేసి సనాతన ధర్మం అంటూ నాసిరకమైన గ్రాఫిక్స్ ని ఉపయోగించి సినిమాని సర్వ నాశనం చేసేశారు. దీంతో ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.
ఫలితంగా కేవలం 75 కోట్ల రూపాయిల షేర్ వద్దనే థియేట్రికల్ రన్ ఆగిపోయింది. కానీ పవన్ క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ వరకు మ్యానేజ్ చేసింది ఈ చిత్రం. ఇది ఇలా ఉండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అమెజాన్ ప్రైమ్ కారణంగానే హడావడిగా ఈ చిత్రాన్ని జులై నెలలో విడుదల చేయాల్సి వచ్చింది. ముందుగా హిందీ వెర్షన్ ని తప్ప, అన్ని భాషలకు ఒప్పందం చేసుకొని డీల్ ముగించారు. ఇప్పుడు హిందీ వెర్షన్ ని కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థకే రీసెంట్ గా అమ్మేసారట. ఆగష్టు 15 నుండే స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు, కానీ రెండు పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు థియేటర్స్ లో విడుదల అవుతుండగా, జనాలు ద్రుష్టి మొత్తం ఆ రెండు సినిమాల మీదనే ఉంటాయి అనే ఉద్దేశ్యంతో ఓటీటీ విడుదల ని వాయిదా వేశారు.
Also Read: ‘రాజా సాబ్’ కూడా అంతే.. నిధి అగర్వాల్ సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి?
ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆగష్టు 22 న కానీ,24 న కానీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు టాక్. థియేటర్స్ లో డిజాస్టర్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ చిత్రం కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. థియేటర్స్ లో విడుదలై ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న అనేక సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి గ్రాఫిక్స్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే కచ్చితంగా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది. మరి మేకర్స్ ఓటీటీ వెర్షన్ కి మంచి గ్రాఫ్సిస్ ని అప్డేట్ చేశారో లేదో చూడాలి.