https://oktelugu.com/

Jagan Vs Sharmila: వైసిపి స్టాండ్ మారింది.. షర్మిల ఇక శత్రువే!

వైయస్సార్ కుటుంబ అభిమానుల్లో ఇప్పుడు చీలిక కనిపిస్తోంది. ప్రధానంగా షర్మిలకు అన్యాయం జరిగిందని మెజారిటీ వర్గం భావిస్తోంది. అందుకే ఇప్పుడు వైసీపీ యూటర్న్ తీసుకుంది. షర్మిల విషయంలో జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 27, 2024 / 10:53 AM IST

    Jagan Vs Sharmila

    Follow us on

    Jagan Vs Sharmila: షర్మిల విషయంలో వైసీపీ డిఫెన్స్ లో పడింది. షర్మిల రాజకీయ ఉద్దేశంతోనే వరుసగా జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఒకస్థిర నిర్ణయానికి వచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆస్తి వివాదానికి సంబంధించి షర్మిల దురుద్దేశంతో ఉన్నారని గ్రహించింది. దీని వెనుక టిడిపి ప్రోద్బలం ఉందని బలంగా నమ్ముతోంది. అందుకే ఇకనుంచి షర్మిల విషయంలో ఉపేక్షించకూడదని భావిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత షర్మిల.. కేవలం ఒకే అజెండాతో ముందుకు వెళ్లడాన్ని గుర్తుచేస్తోంది వైసిపి. ప్రస్తుతం ఆస్తుల వివాదం నేపథ్యంలో షర్మిల గతంలో చేసుకున్న ఎంవోయుకు భిన్నంగా షేర్లను విక్రయించిందని.. అందుకే జగన్ సీరియస్ గా తీసుకుని ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. షర్మిల విషయంలో ఇలానే వదిలేస్తే మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వైసిపి నేతలు. షర్మిల చట్టవిరుద్ధ చర్యలు చేపడుతున్నందున.. ఆమెపై క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటివారు వాదిస్తున్నారు. జగన్ పై ఉద్దేశపూర్వకంగా షర్మిల కక్ష సాధింపునకు దిగుతున్నారని.. అందుకే జగన్ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు సజ్జల. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

    * షేర్ల బదలాయింపు ఆపాలని
    ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న షేర్లను కావలిసే బదిలీ చేశారని.. దానిని ఆపాలని మాత్రమే జగన్ కోర్టుకు వెళ్లారని గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతే తప్ప షర్మిలకు ఇచ్చిన ఆస్తులు వెనక్కి తీసుకోవాలని కాదని చెబుతున్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఇది తెలిసిన తర్వాత మాత్రమే ఆ షేర్ల బదిలీ చట్ట విరుద్ధమంటూ ఆపాలని చెల్లెలికి జగన్ రేఖ రాశారని చెబుతున్నారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే న్యాయ నిపుణుల అభిప్రాయంతో కోర్టును ఆశ్రయించారని చెప్పుకొస్తున్నారు.

    * ముందుకొస్తున్న వైసీపీ నేతలు
    అయితే తొలుత వైయస్సార్ కుటుంబ ఆస్తి వివాదం పై వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇటీవల మాత్రం వరుసగా వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వై వి సుబ్బారెడ్డి, పేర్ని నాని, పులివెందుల సతీష్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇలా అందరూ వరుస పెట్టి వస్తున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజల్లోకి షర్మిల చర్యలను బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నేతలకు సూచించారు.