Homeఎంటర్టైన్మెంట్Irumudi latest poster: ఆసక్తి రేపుతున్న రవితేజ 'ఇరుముడి' లేటెస్ట్ పోస్టర్..హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?

Irumudi latest poster: ఆసక్తి రేపుతున్న రవితేజ ‘ఇరుముడి’ లేటెస్ట్ పోస్టర్..హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?

Irumudi latest poster: రొటీన్ కమర్షియల్ సినిమాలతో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకుంటూ మార్కెట్ ని పాడు చేసుకున్న మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja), ఇక నుండి స్క్రిప్ట్ సెలక్షన్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యినట్టు ఉన్నాడు. అందుకే ‘ఇరుముడి'(Irumudi Movie) లాంటి సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. నివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రవితేజ పుట్టినరోజు నాడు విడుదల చేశారు మేకర్స్. దీనికి అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది కదా మేము రవన్న నుండి ఆశించింది, ఈసారి కం బ్యాక్ మామూలుగా ఉండదు అంటూ రవితేజ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. చాలా కాలం తర్వాత రవితేజ సినిమాకు జనాల్లో నిజమైన క్రేజ్ ని రప్పించింది ఈ చిత్రం.

అయితే రేపు ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ప్రీ లుక్ ని నేడు విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ లో కేవలం అద్దం లో ఆమె కళ్ళను మాత్రమే చూపించారు. ఆ కళ్ళను చూసి హీరోయిన్ ఎవరో ఆడియన్స్ ఊహించాలి. చూస్తుంటే తెలుగు స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన కళ్ళు లాగా అసలు అనిపించడం లేదు. పోనీ అప్ కమింగ్ హీరోయిన్ అని అనుకోడానికి కూడా లేదు. ఎక్కడో చూసినట్టు ఉంది కానీ, ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాం అని అనిపిస్తుంది కదూ. ఆ హీరోయిన్ కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి అయితే కాదు, తమిళ సినిమా ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి. ఆమె మరెవరో కాదు, ప్రియా భవాని శంకర్. ఈమె తమిళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది కానీ, పెద్ద స్థాయికి మాత్రం వెళ్లలేకపోయింది.

యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈ అమ్మాయి, తన అందం తో, అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అయితే తెచ్చుకుంది కానీ, టాప్ స్టార్ మాత్రం కాలేకపోయింది. తెలుగు లో ఇప్పటి వరకు ఈమె ఎలాంటి సినిమాలో కూడా నటించలేదు. ఇదే ఆమె మొట్టమొదటి సినిమా అనుకోవచ్చు. కానీ అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘దూత’ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు వెబ్ సిరీస్ లో మాత్రం ఈమె హీరోయిన్ గా నటించింది. ఇక ‘ఇరుముడి’ లో ఆమెకు నటనకు గొప్ప ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. ముందుగా ఈ పాత్ర కోసం సమంత, కీర్తి సురేష్ లాంటి వాళ్ళను అడిగారు. కానీ వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడం తో ప్రియా భవాని శంకర్ ఆ అవకాశం అందుకుంది. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా ప్రియా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version