Homeబిజినెస్Itel A100 price: 5000 mAh బ్యాటరీ..LED ఫ్లాష్ కెమెరా.. ధర మాత్రం రూ.7 వేల...

Itel A100 price: 5000 mAh బ్యాటరీ..LED ఫ్లాష్ కెమెరా.. ధర మాత్రం రూ.7 వేల లోపే..

Itel A100 price: ఇప్పుడున్న కాలంలో మొబైల్ లేకుండా రోజు గడవని పరిస్థితిలా మారింది. ప్రతి ఒక్కరూ ఏదో రకమైన మొబైల్ కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంతమంది తక్కువ బడ్జెట్ లోనే ఫోన్ కొనాలని అనుకుంటారు. కానీ ఇదే సమయంలో ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో పాటు మంచి కెమెరా, ఆకట్టుకునే ఫీచర్లు ఉండాలని అనుకుంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ఫీచర్లు, బ్యాటరీ విషయంలో ప్రీమియంలా ఆలోచించి ధర మాత్రం తక్కువగాని నిర్ణయిస్తారు. అలాంటి మొబైల్ ఒకటి ఇప్పుడు మార్కెట్లో ఉంది. ఆ ఫోన్ ఏదో ఇప్పుడు చూద్దాం..

లక్ష రూపాయల మొబైల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. కానీ ఎక్కువగా తక్కువ ధరకు అందించే మొబైల్స్ సేల్స్ అవుతూ ఉంటాయి. ఇందులో భాగంగా itel కంపెనీకి చెందిన A 100 అనే మొబైల్ చీఫ్ లోనే వస్తుంది. అయితే ఈ మొబైల్లో ఉండే ఫీచర్లను చూస్తే ఇది కాస్ట్లీ ఫోనా..? అని అంటారు. ఈ మొబైల్లో 6.6 అంగుళాల డిస్ప్లే ను అమర్చారు. ఇది 180 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. షాంప్లింగ్ రేట్, డైనమిక్ బార్, 480 nits బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇందులో G57 MP1GPU తో 12 nm ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 8 GB వరకు Ram ఉండనుంది. 64 GB స్టోరేజ్ ఉండడంతో కావలసిన ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ద్వారా పనిచేసే ఇందులో LED ఫ్లాష్ తో 8 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 5 MP ఫ్రంటు కెమెరా ఉండడంతో కావలసిన ఫోటోగ్రఫీని పొందవచ్చు. AI తరహాలో కూడా ఫోటోలు కావాలంటే దీని ద్వారా తీసుకోవచ్చు.

రోజువారి వినియోగం మొబైల్ తో ఎక్కువగా ఉండడంతో బ్యాటరీ అవసరం ఎక్కువగా మారింది. దీంతో ఫోన్ వాడేవారు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. Itel ఈ కొత్త మొబైల్ ఉండ 5000 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 10 W ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. ఈ మొబైల్ లో వైఫై 11 ac, బ్లూటూత్ కనెక్టివిటీ 5, DTS సౌండ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని మార్కెట్లో రూ. 7,499 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిని కొనుగోలు చేసిన తర్వాత 100 రోజుల్లో స్క్రీన్ సమస్య ఉంటే రిప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన Itel A 90 సక్సెస్ అయిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా A 100 రాబోతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version