https://oktelugu.com/

నిర్మాతలు బయట పడాలంటే అదొక్కటే మార్గం !

కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ మళ్ళీ దాదాపు మరో నాలుగు నెలలు వెనక్కు వెళ్లిపోయేలా ఉంది. ఏప్రిల్ సెకెండ్ వీక్ నుంచి మొదలైన సెకెండ్ వేవ్ ప్రభావం సెప్టెంబర్ వరకు ఉండేలా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాల సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్లాన్ చేసిన సినిమాలన్నీ పూర్తి కాకుండానే కరోనా కారణంగా అదనపు బడ్జెట్ తో ఇప్పటికే బోర్డర్స్ దాటేశాయి. కోవిడ్ నివారణ చర్యల పేరుతో చేసే కార్యక్రమాలు నిర్మాతలకు అధిక భారం […]

Written By: , Updated On : May 3, 2021 / 08:48 AM IST
Follow us on

 Film Producers

కరోనా సెకండ్ వేవ్ వల్ల టాలీవుడ్ మళ్ళీ దాదాపు మరో నాలుగు నెలలు వెనక్కు వెళ్లిపోయేలా ఉంది. ఏప్రిల్ సెకెండ్ వీక్ నుంచి మొదలైన సెకెండ్ వేవ్ ప్రభావం సెప్టెంబర్ వరకు ఉండేలా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో చాల సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్లాన్ చేసిన సినిమాలన్నీ పూర్తి కాకుండానే కరోనా కారణంగా అదనపు బడ్జెట్ తో ఇప్పటికే బోర్డర్స్ దాటేశాయి.

కోవిడ్ నివారణ చర్యల పేరుతో చేసే కార్యక్రమాలు నిర్మాతలకు అధిక భారం అయిపోతుంది. దీనికితోడు వడ్డీ ఖర్చు ఒకటి. సహజంగా ఎంత పెద్ద నిర్మాత అయినా.. కచ్చితంగా ఎంతోకొంత ఫైనాన్స్ తీసుకునే సినిమా చేస్తాడు. ఇప్పుడు ఆ వడ్డీ లెక్కలు నిర్మాతలకు కొత్త తలనొప్పిగా మారాయి. మళ్ళీ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభమైనా, సినిమా పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలల నుంచి ఏడు నెలలు పడుతుంది.

అంటే దాదాపు పది నెలల వడ్డీ నిర్మాతల పై పడనుంది. కోట్లు రూపాయిలు ఫైనాన్స్ తీసుకుంటారు కాబట్టి.. వడ్డీ రేటు అధికంగా ఉంటుంది కాబట్టి, నిర్మాతలకు నష్టాలు ఎక్కువగానే ఉండేలా ఉన్నాయి. ఇక చిన్న, బిలో మిడిల్ రేంజ్ సినిమాల నిర్మాతలకు నిద్ర కూడా పట్టని పరిస్థితులు ఉన్నాయి. నిజానికి కరోనా సెకెండ్ వేవ్ వస్తోందని ఎవ్వరూ ఊహించలేదు.

దాంతో ఎలాంటి ప్లానింగ్ లో లేని నిర్మాతలు, రిలాక్స్డ్ గా సినిమాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అంతా రెడీ అనుకుని షూట్ కి వెళ్లే టైంలో కరెక్ట్ గా కరోనా వచ్చింది. ఇప్పుడు బిలో మిడిల్ రేంజ్ నిర్మాణ సంస్థలు ఈ కష్ట కాలం నుండి బయట పడాలి అంటే.. రిస్క్ అయినా సాధ్యమైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి.. కనీసం ఓటిటీలోనైనా సినిమాలు రిలీజ్ చేసుకోవాలి.