Allu Arjun: గంగోత్రి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, ఆ సినిమా సక్సెస్ అయితే సాధించింది. కానీ ఆ సినిమా హీరోగా తనకు ఏ మాత్రం హెల్ప్ అయితే అవ్వలేదు. ఇక దాంతో ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమాతో తనకంటూ ఒక మంచి స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకొని స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ స్టార్ హీరో గా ఎదగడమే కాకుండా నటన లో వైవిధ్యాన్ని చూపిస్తూ, డాన్స్ లో ది బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తూ, ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేశాడు.
దానివల్ల ఆయన స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకతను అయితే చాటుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన చేస్తున్న పుష్ప సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక దానికి సీక్వేల్ గా ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అట్లీ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏవి సక్సెస్ కావడం లేదు.
ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో సినిమాను అనౌన్స్ చేసిన అట్లీ ఆ తర్వాత అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తెలుగులో ఉన్న అందరు హీరోలతో ఒక్కో సినిమా చేయడమే తన డ్రీమ్ గా అట్లీ ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.
ఇక అందులో భాగంగానే ముందుగా పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి హీరోలను కూడా డైరెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే అట్లీ అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పినప్పటికీ ఆయన దానిమీద ఎలాంటి స్పందనను తెలియజేయకపోవడంతో నెక్స్ట్ మరో కథతో అల్లు అర్జున్ ని పలకరించబోతున్నట్టుగా తెలుస్తుంది…