Highest Remuneration For That Contestant: బిగ్ బాస్ సీజన్ 6 మొత్తానికి చాలా ఆసక్తికరంగా మొదలైంది. పైగా ఈ సీజన్ 6 విభిన్నమైన కంటెంట్ తో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వస్తోంది. అందుకే.. తెలుగు ప్రేక్షకులు కూడా సీజన్ 6 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎవ్వరూ ఊహించని వారు ఎంట్రీ ఇచ్చారు. అయితే, సీజన్ 6 లో ఐదో కంటెస్టెంట్‌గా చలాకీ చంటీ ఎంట్రీ ఇచ్చాడు.

జబర్దస్త్‌లో చలాకీ చంటీకి మంచి ఇమేజ్ ఉంది. తన డైలాగ్ మాడ్యులేషన్ తో అందరికీ సుపరితులైన ఈ సెలబ్రిటీ.. తాజాగా బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా చంటి తన జీవితం గురించి, ప్రేమ, పెళ్లి గురించి వేదిక పై ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇక చంటి హౌస్ లోకి వెళ్లే ముందు నాగార్జున అతనికి హార్ట్ సింబల్ ఉన్న ఓ కార్డును ఇచ్చారు. చంటి ఆ కార్డుని తీసుకొని ఇంటిలోకి అడుగుపెట్టాడు.
మరి ఆ హార్ట్ సింబల్ కార్డుతో చంటి ఎలాంటి గేమ్స్ ఆడతాడో చూడాలి. అయితే, తాజాగా చంటి రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అటు జబర్ధస్త్‌లో, ఇటు సినిమాల్లో సత్తా చాటుతోన్న చంటికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. అందుకే, అతనికి సీజన్ 6లోనే అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ షోకి తీసుకు వచ్చారని తెలుస్తోంది.
ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. చంటికి రోజుకు 6 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సీజన్ లోనే హియ్యేస్ట్ రెమ్యునరేషన్ ఇదే అని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ 6 షో హౌస్ ను నిర్వహకులు చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తానికి ఈ ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో వైభవంగా ప్రారంభం అయ్యింది.

అన్నిటికీ మించి ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు పరచబోతున్నారు. ఏది ఏమైనా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా… అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా ఆ స్థాయిలోనే అలరిస్తోందని అంచనాలు ఉన్నాయి.