YCP MLA In Pawan Birthday: వైసీపీ పార్టీకి.. ఆ పార్టీ అధినేత జగన్ కు బద్ధ శత్రువుగా మారిపోయాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటేనే వైసీపీ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇటీవల విజయవాడలో వైసీపీ జెండా గద్దెలు కూల్చేసి.. ఆ పార్టీ నేత పోతిన మహేష్ పై దాడి చేసి జైలుకు పంపారు. అంతలా జనసేన మీద పడిపోతోంది వైసీపీ.

ఓవైపు వైసీపీ అధిష్టానం అంతా జనసేనపై పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటే మరో వైసీపీ ఎమ్మెల్యే మాత్రం జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో అన్నదానంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈనెల 2న అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్తానిక వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య పాల్గొని జనసేన నాయకులతో కలిసి అన్నం వడ్డించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్ అయ్యాయి.

క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ అన్నా.. ఆయన వెంట ఉండే యూత్ అన్న వైసీపీ నేతలకు అభిమానమే.. పార్టీ పరంగా.. సిద్ధాంత పరంగా విభేదిస్తున్నా.. పవన్ ఫ్యాన్స్ మద్దతు లేకుండా మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు లేరు. అందుకే వారు చేపట్టిన కార్యక్రమంలో పార్టీ అధిష్టానానికి ఇష్టం లేకున్నా సరే.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల ప్రభావంతో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
[…] […]