https://oktelugu.com/

Heroines: ఈ హీరోయిన్ లు నటనలో మెప్పించారు.. నిజజీవితంలో డాక్టర్ గా సేవలందిస్తున్నారు..

సౌత్ ఇండియాలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ లలో సాయి పల్లవి ముందుంటుంది. తన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ. ఇక డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు నిజ జీవితంలో డాక్టర్. జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో 2016లో తన వైద్య విద్యను కంప్లీట్ చేసింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 1, 2024 / 04:30 PM IST

    Heroines

    Follow us on

    Heroines: మన సినీ ఇండస్ట్రీలో నటీనటులకు చాలా అభిమానులు ఉన్నారు. వారి యాక్టింగ్ లెవల్స్ చూసి ఫిదా అవుతుంటారు. అయితే సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు వేస్తూ మంచి పేరు కూడా సంపాదిస్తారు. ఇక కొంతమంది డాక్టర్ పాత్రలో మెరిసారు. కేవలం డాక్టర్ అనేది కొందరి జీవితంలో పాత్ర మాదిరి మాత్రమే నిలిచిపోలేదు. వారి నిజజీవితంలో వృత్తి కూడా డాక్టర్ అంటున్నారు నటులు. ఇంతకీ నిజ జీవితంలో డాక్టర్ అయిన ఆ నటులు ఎవరు అనుకుంటున్నారా? అయితే ఓ సారి చూసేద్దాం.

    సౌత్ ఇండియాలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ లలో సాయి పల్లవి ముందుంటుంది. తన టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ. ఇక డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు నిజ జీవితంలో డాక్టర్. జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో 2016లో తన వైద్య విద్యను కంప్లీట్ చేసింది. గతంలో వైద్య సేవలు అందించడానికి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వీటిలో నిజం లేదని డాక్టర్ వృత్తిని కంటిన్యూ చేస్తూనే తనకు ఇష్టమైన నటనారంగంలో కంటిన్యూ అవుతానంటూ తెలిపింది సాయి.

    ఐశ్వర్య లక్ష్మీ: విభిన్నమైన నటనతో ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. మోడలింగ్ ద్వారా యాక్టింగ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్యకు సౌత్‌లో ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఐశ్వర్య నిజ జీవితంలో డాక్టర్. శ్రీ నారాయణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SNIMS) నుంచి MBBS పూర్తి చేసుకుంది అమ్మడు.

    శ్రీలీల: గత పదేళ్ళలో ఇండస్ట్రీకి దూసుకొచ్చింది ఈ బాపు బొమ్మ. అసలు ఒక ఏడాది కిందట ఈ బ్యూటీ ఫుల్ బిజీ. ఇక సినిమాలో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్రీలీల తల్లి గైనకాలజిస్ట్. తల్లి స్ఫూర్తితో శ్రీలీల కూడా డాక్టర్ గా మారింది. ఈ బ్యూటీ MBBS డిగ్రీని 2021లో పూర్తి చేసిందట.

    మానుషి చిల్లర్ : మిస్ వరల్డ్ 2017 టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత, మానుషి చిల్లర్ అభిమానులను దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. తన నిజ జీవితంలో డాక్టర్. అందాల పోటీల్లో పాల్గొనడానికి తన చదువుకు విరామం తీసుకున్న తర్వాత, మానుషి సోనిపట్‌లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజీలో MBBS పూర్తి చేసింది.

    అదితి శంకర్: ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె ఈ అదితి శంకర్. వీరమన్, మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది అమ్మడు. ఆమె నటనా జీవితంతో పాటు, అదితి డాక్టర్ అని సమాచారం. అయితే ఈ అమ్మడు రామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి MBBS పట్టా పొందారు.

    రూప కుడవయూర్: ఈ తెలుగు అందం ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరిత్య డాక్టర్. కానీ రూప తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ. అమ్మడు నేటీవ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ.