Hamas : ఇజ్రాయెల్ పై దాడితో హమాస్ అనుకున్న లక్ష్యాల్ని సాధించింది

ఇజ్రాయెల్ పై దాడితో హమాస్ అనుకున్న లక్ష్యాల్ని సాధించింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 20, 2023 10:09 pm

Hamas : చరిత్రలోనే ఎరుగని అత్యంత భయానక దాడికి గురైన ఇజ్రాయిల్‌లో.. హమాస్‌ ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. తాజా దాడిలో వారు పారాగ్లైడర్లుగా దిగి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. అసాధారణ నిఘాకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్‌ ఈ విపత్తును ఊహించలేకపోయిందా? దీని సమాధానం కానే కాదని తెలుస్తోంది.

పారాగ్లైడర్లతో దాడి కుట్ర గురించి 2014 జూన్‌లోనే ఇజ్రాయిల్‌కు తెలిసింది. నాడు గాజాలో పట్టుబడిన హమాస్‌ కమాండర్‌ ఈ విషయం చెప్పాడు. మోటారుతో పనిచేసే పారాచూట్ల ఆధారంగా దాడికి దిగేందుకు హమాస్‌ ఇతడితో పాటు 10 మందిని 2010లోనే మలేసియా పంపి శిక్షణ ఇప్పించింది. ప్రతి ఐదు నెలలకు ఆయుధ శిక్షణ కూడా పొందాడు. మరోవైపు కొందరు ఉగ్రవాదులను పనివారుగా విదేశాలకు పంపి.. అక్కడి టెక్నాలజీని నేర్చుకునేలా హమాస్‌ వ్యూహం పన్నింది. అనంతరం గాజాస్ట్రిప్ లోనే శాశ్వత శిబిరం ఏర్పాటు చేసింది. కానీ, పారాగ్లైడర్స్‌ దాడులకు దిగకపోవడంతో ఇజ్రాయెల్‌ ఉదాసీనంగా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకున్న హమాస్‌.. వందల పారాగ్లైడర్లను రంగంలోకి దింపింది. వారు దిగుతూనే కాల్పులకు తెగబడి పదుల సంఖ్యలో ప్రాణాలను బలిగొన్నారు. ఆత్మాహుతికి సైతం సిద్ధంగా ఉన్న ఈ పారాగ్లైడర్లు.. ప్రజలు, సైనికులను బందీలుగా చేసుకున్నారు.

ఇజ్రాయిల్ లో ఊచకోత వెనక కీలక పాత్ర పోషించిన మరో హమాస్ టాప్ కమాండర్ ను హతమార్చామని ఐడీఎఫ్ ఆదివారం ప్రకటించింది. గాజా లోని ఓ బిల్డింగ్ లో ఉన్న హమాస్ మిలిటరీ వింగ్ నుఖ్బా ఫోర్స్ కు చెందిన నేవల్ ఫోర్స్ టాప్ కమాండర్ బిలాల్ అల్ కేద్రాను బాంబు దాడి చేసి చంపేశామని వెల్లడించింది.

ఇజ్రాయెల్ పై దాడితో హమాస్ అనుకున్న లక్ష్యాల్ని సాధించింది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.