Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, ఈరోజు ఉదయం బెయిల్ మీద విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అభిమానులు, మెగా అభిమానులు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ ని కలిసేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులందరూ వచ్చారు. మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నిన్న వచ్చి వెళ్లారు కానీ, ఈరోజు వచ్చి అల్లు అర్జున్ ని కలిసినట్టు ఎక్కడా సమాచారం లేదు. కానీ చిరంజీవి సతీమణి సురేఖ మాత్రం తెల్లవారుజామున అల్లు అర్జున్ ఇంటికి వచ్చి, అతన్ని కలిసి బాగా ఎమోషనల్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ తో రీసెంట్ గా ‘పుష్ప 2’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు కూడా ఆయన్ని కలిసేందుకు వచ్చారు.
ఇలా అందరూ అల్లు అర్జున్ విడుదలపై హర్షం వ్యక్తం చేస్తుంటే, ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం విచారాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన మాట్లాడుతూ ‘అసలు ఎందుకు పుడుతారండీ ఇలాంటోళ్ళు..ఇలాంటి ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ప్రతీ ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, వీటి అన్నిటికి బాద్యుడు నిరంజన్ రెడ్డి గారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. నిరంజన్ రెడ్డి బెయిల్ ఇప్పించినందుకు అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నట్టుగా శ్రీనివాస్ అయ్యంగార్ రియాక్షన్ అనిపించింది. ఈయన ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో కాంట్రవర్సి కామెంట్స్ చేసి సంచలనం రేపాడు. అప్పట్లో వైసీపీ పార్టీ పై, ఆ పార్టీ పథకాలపై తీవ్రమైన సెటైర్లు వేస్తూ వీడియోలు చేసిన ఆయన, ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్ లో జర్నలిస్టులపై అత్యంత నీచమైన కామెంట్స్ చేసాడు.
ఇలా ఎల్లప్పుడూ కాంట్రవర్సీలతో కాలక్షేపం చేసే శ్రీకాంత్ అయ్యంగార్, టాలీవుడ్ లో మంచి బిజీ గా ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది లో ఆయన 8 సినిమాలకు పైగా చేసాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఆరు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రం తో పాటుగా, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం కూడా ఉంది. అల్లు అర్జున్ తో కలిసి ఇప్పటి వరకు ఆయన ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ, గీత ఆర్ట్స్ బ్యానర్ లో అత్యధిక సినిమాలు మాత్రం చేసాడు. ముఖ్యంగా గీత ఆర్ట్స్ లో తెరకెక్కిన ‘ప్రతి రోజు పండగే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో శ్రీకాంత్ అయ్యంగార్ పోషించిన పాత్రకి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కారణంగానే ఆయనకి అవకాశాలు క్యూలు కట్టాయి. అలా తన కెరీర్ కి ఉపయోగపడే సినిమాని ఇచ్చిన కుటుంబం పై శ్రీకాంత్ అయ్యంగార్ ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం.
Actor Srikanth reaction on #AlluArjun bail. pic.twitter.com/Nif4ZhqY3d
— At Theatres (@AtTheatres) December 13, 2024