https://oktelugu.com/

Aditya 369 Heroine: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ‘ఆదిత్య 369’ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందంటే?

మోహిణి అసలు పేరు మమాలక్ష్మి. తమిళనాడులోని తంజావూరులో ఈమె జన్మించింది. చిల్డ్రన్స్ గార్డెన్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈమె ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

Written By: , Updated On : December 1, 2023 / 12:36 PM IST
Aditya 369 Heroine

Aditya 369 Heroine

Follow us on

Aditya 369 Heroine: సినిమాల్లో ఒకప్పుడు హల్ చల్ చేసిన హీరోయిన్లు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయారు. వీరిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుండగా..మరికొందరు టీవీ సీరియళ్లు, ఇతర ప్రోగ్రామ్స్ లో నటిస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. బాలకృష్ణ కెరీర్ లోనే ది బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ‘ఆదిత్య 369’ సినిమా గురించి ఎవరూ మరిచిపోరు. ఇందులో ద్విపాత్రాభినయం చేసిన బాలకృష్ణకు ఒక పాత్రలో మోహిని అనే హీరోయిన్ నటించింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం ఎలా ఉందో? ఏం చేస్తుందో చూస్తే షాక్ అవుతారు.

మోహిణి అసలు పేరు మమాలక్ష్మి. తమిళనాడులోని తంజావూరులో ఈమె జన్మించింది. చిల్డ్రన్స్ గార్డెన్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈమె ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1987లో రిలీజ్ అయిన ‘కూట్టు పుజుక్కల్’ అనే సినిమాలో మోహిని బాలనటిగా కనిపిస్తుంది. ఇందులో రఘవరన్, అమల నటించిన ఇందులో హీరోయిన్ కు చెల్లెలుగా నటించింది. అయితే ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక ‘ఈరమన రోజావే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘నాడోడి పటుకారన్’ అనే సినిమాతో మోహినికి గుర్తింపు వచ్చింది.

ఆ తరువాత ఈమెకు తెలుగు నుంచి అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తరువాత మోహన్ బాబు నటించిన డిటెక్టివ్ నారద అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. ఆ తరువాత మిగతా హీరోయిన్ల పోటీకి మోహిని తట్టుకోలేకపోయింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో ఆయన చెల్లెలు పాత్రలో నటించింది.

తెలుగులో తక్కువగా నటించిన మోహినికి తమిళంలో అవకాశాలు విపరీతంగా వచ్చాయి. సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే మోహినికి భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్ల పాటు వీరు కలిసున్నా.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో ప్రస్తుతం మోహిని అమెరికాలో క్రైస్తవ మతంలోకి మారి ఒంటరికగానే జీవిస్తోంది. ఇటీవల ఆమె పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఆమెను చూసి షాక్ అవుతున్నారు. ఒకప్పుడు సినిమాలో నీలికళ్లతో ప్రత్యేకంగా కనిపించిన మోహిన ప్రస్తుతం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు