Duster: త్వరలో భారత మార్కెట్లోకి ‘డస్టర్’ నెక్ట్స్ జెన్.. ధర, ఫీచర్స్ చూస్తే మతి పోతుంది..

డస్టర్ పాత వెర్షన్ కంటే నెక్ట్స్ జెన్ కొత్త లుక్ తో ఆకర్షిస్తోంది. పూర్తి ఎస్ యూవీతో వస్తున్న ఇందులో ప్లాట్ బానెట్, ఎల్ ఈ డీ హెడ్ లైట్, గ్రిల్ లో ఎల్ ఈడీ డీఆర్ఎస్, బ్లాక్ అవుట్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఆకర్షస్తున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : December 1, 2023 3:44 pm

Duster

Follow us on

Duster: రెనాల్ట్ కంపెనీ నుంచి రిలీజ్ చేసిన ‘డస్టర్’ కారు గురించి ఎవరూ మరిచిపోరు. ఒకప్పుడు ఎస్ యూవీ కారల్లో డస్టర్ నెంబర్ వన్ స్థానంలో ఉండేది. చాలా మంది వీఐపీలు డస్టర్ కోసం క్యూ కట్టేవారు. అయితే కొన్ని కారణాల వల్ల దీని సేల్స్ పడిపోవడంతో కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేసింది. కానీ దీనిని ఇప్పుడు అధునాతనంగా తీసుకొస్తుంది. కొన్ని మార్పులు చేసి అధునాతన సాంకేతికతను జోడించి..Next Gen (3rd Version) పేరుతో తీసుకొచ్చింది. ఈ మోడల్ గురించి అఫీషియల్ గా తెలపకపోయినా ఆన్ లైన్ లో మాత్రం ఫొటోలు రిలీజ్ అయ్యాయి. వీటిని చూసిన కారు ప్రియులు షాక్ అవుతున్నారు. ఇంతకీ అవి ఎలా ఉన్నాయంటే?

డస్టర్ పాత వెర్షన్ కంటే నెక్ట్స్ జెన్ కొత్త లుక్ తో ఆకర్షిస్తోంది. పూర్తి ఎస్ యూవీతో వస్తున్న ఇందులో ప్లాట్ బానెట్, ఎల్ ఈ డీ హెడ్ లైట్, గ్రిల్ లో ఎల్ ఈడీ డీఆర్ఎస్, బ్లాక్ అవుట్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ ఆకర్షస్తున్నాయి. సిల్వల్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్న దీనిపై బుల్ బార్ తరహా బంపర్ ఇన్వర్ట్ ఉంది. రేర్ క్వార్టర్ ప్యానెల్ వంటివి దీనిని ఆకర్షిస్తున్నాయి. డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేతో పాటు ఏసీ వెంట్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.యూఎస్ బీ తో పాటు వైర్ లెస్ చార్జర్ల సదుపాయాన్ని కల్పించారు.

డస్టర్ నెక్ట్స్ జెన్ ఇంజిన్ మూడు ఆప్షన్లను కలిగి ఉంది. ఇందులో 1.0 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 120 బీహెచ్ పీ పవర్, 20 హెచ్ పీ హైబ్రిడ్ టెక్నాలజీ పవర్ తో 1.2 లీటర్ పెట్రోల్ ను కలిగి ఉంది. మరొకటి 1.3 లీటర్ టర్బో చార్జ్ ఇంజిన్ ను కూడా అమర్చారు. వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ కంట్రోల్ ఫీచర్, డ్యూయల్ టోన్ థీమ్, 5 సీటర్, కొత్త ఫ్రీ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోమెంట్ సిస్టమ్ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

పోర్చుగల్ లో జరిగిన ఓ ఈవెంట్ లో రెనాల్ట్ డస్టర్ నెక్ట్స్ జెన్ ను ఆవిష్కరించారు. త్వరలో దీనిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే అంతకుముందుగానే దీని పిక్స్ నెట్లో వైరల్ కావడంతో చాలా మంది ఒకప్పటి డస్టర్ ప్రియులు మరోసారి దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డస్టర్ ను కేవలం ఒక వెహికల్ గానే కాకుండా దానిని సొంతం చేసుకోవడం ఒక లక్ష్యం అన్నట్లుగా చాలా మంది భావిస్తారు. ఈ మోడల్ ధర విషయానికొచ్చేసరికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు.