Star Hero: ఎప్పుడైనా? ఎక్కడైనా?ఎవరైనా?… డబ్బుల విషయంలో ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మిత్రుల మధ్య కూడా విబేధాలు వచ్చేస్తాయి. మొహమాట పడి నిర్లక్ష్యం చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఆర్థిక లావాదేవీల విషయంలో అనేక లొసుగులు చోటు చేసుకుంటాయి. ఏదీ అనుకున్న ప్రకారం జరగదు. డబ్బులు తీసుకొని సినిమా చేయకుండా నిర్మాతలను తిప్పించుకునే హీరోలను, సినిమా చేయించుకొని హీరోలకు డబ్బులు ఇవ్వని నిర్మాతలను మనం చూడవచ్చు.అందుకే తరచుగా పెద్దల సమక్షంలో పంచాయితీలు జరుగుతుంటాయి.

తాజాగా ఒక హీరో అలాంటి సమస్యే ఎదుర్కొంటున్నాడట. తన రెమ్యూనరేషన్ ఇవ్వకుండా నిర్మాత తిప్పించుకుంటున్నాడట. కనీసం కాల్స్ కి కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదట. సినిమా విడుదలకు ముందు నిర్మాత-హీరో మంచి రిలేషన్ మైంటైన్ చేశారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఇలాంటి హీరో దొరకడం నా అదృష్టం అని నిర్మాత అంటే… ఇంత మంచి నిర్మాతను నేను లైఫ్ లో చూడలేదని హీరో చెప్పుకొచ్చాడు. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఇద్దరూ పాలు నీరు వలె కలిసి ఉన్నారు.
సినిమా విడుదలయ్యాకే అసలు మనస్తత్వాలు బయటకు వచ్చాయి. ఎన్నో ఆశలు పెట్టుకొని విడుదల చేసిన మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. డిజాస్టర్ టాక్ తో భారీగా నష్టాలు మిగిల్చింది. దాదాపు 50 శాతం నష్టాలు ఆ సినిమాకు వచ్చాయి. ఈ క్రమంలో హీరోకి నిర్మాత హ్యాండ్ ఇచ్చాడట. హీరోకి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదట. తనకు రావలసిన డబ్బుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదట.

కాల్స్ చేస్తుంటే ఎత్తడం లేదని, నేరుగా ఆఫీస్ కి, ఇంటికి వెళ్లినా దొరకడం లేదట. సిబ్బందితో బిజీగా ఉన్నారు, ఇంట్లో లేరని చెప్పిస్తున్నారట. మంచికి పోయి ఆ నిర్మాతను నమ్మిన హీరో నిండా మునిగిపోయాడనేది టాలీవుడ్ టాక్. చిత్రీకరణ సమయంలో రెమ్యూనరేషన్ తీసుకోమంటే మూవీ విడుదలయ్యాక తీకుంటాను అన్నాడట. ఆ మాట అనడం ఎంత పెద్ద తప్పో అతనికి తెలిసొచ్చిందట. పైగా ఆ నిర్మాత పెద్దగా నష్టపోయింది కూడా లేదట. అనేక మార్గాల్లో డబ్బులు బాగానే రాబట్టుకున్న నిర్మాత హీరోకి మాత్రం చుక్కలు చూపుతున్నాడట. నమ్మినందుకు ఇంత మోసం చేస్తాడా అని సదరు హీరో సన్నిహితుల వద్ద వాపోతున్నాడట.