https://oktelugu.com/

Guntur Karam Movie Poster: ఒకే పోస్టర్ ని తిప్పి తిప్పి వేస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ టీం.. మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్

ఇక నేడు గ్లిమ్స్ వీడియో సందర్భంగా మూవీ టీం ఒక మాస్ పోస్టర్ ని మహేష్ బాబు చేత విడుదల చేయించారు.తలకి ఎరుపు రంగు బ్యాండ్ ని కట్టుకొని, ఫైట్ లోకి దూకుతున్న మహేష్ బాబు ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ని తమ హీరో ని మాస్ అవతారం లో చూడడం అంటే మహా ఇష్టం.

Written By:
  • Vicky
  • , Updated On : May 31, 2023 / 10:45 AM IST

    Guntur Karam Movie Poster

    Follow us on

    Guntur Karam Movie Poster: ఒ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్నా మూడవ సినిమా పేరు ‘గుంటూరు కారం’ అని సోషల్ మీడియా ప్రచారం అవుతుంది. నేడు సాయంత్రం ఈ సినిమాకి సమందించిన టైటిల్ మరియు గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. ముందుగా ఎన్నో టైటిల్స్ అనుకున్నప్పటికీ, మహేష్ బాబు కి ‘గుంటూరు కారం’ అనే టైటిల్ బాగా నచ్చిందని , అందుకే ఆ టైటిల్ కి ఫైనలైజ్ చేసారని టాక్.

    ఇక నేడు గ్లిమ్స్ వీడియో సందర్భంగా మూవీ టీం ఒక మాస్ పోస్టర్ ని మహేష్ బాబు చేత విడుదల చేయించారు.తలకి ఎరుపు రంగు బ్యాండ్ ని కట్టుకొని, ఫైట్ లోకి దూకుతున్న మహేష్ బాబు ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహేష్ ఫ్యాన్స్ ని తమ హీరో ని మాస్ అవతారం లో చూడడం అంటే మహా ఇష్టం.

    ఈమధ్య కాలం లో మహేష్ బాబు కూడా ఒక పూర్తి స్థాయి మాస్ సినిమా చేసి చాలా కాలమే అయ్యింది. అయితే మొన్నటి నుండి మాస్ స్ట్రైక్ అని ప్రచారం చేస్తూ, ఈ గ్లిమ్స్ కి సంబంధించిన ఒకే ఒక్క పోస్టర్ ని మూడు యాంగిల్స్ లో విడుదల చెయ్యడం పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గ్లిమ్స్ లో ఈ ఒక్క షాట్ మాత్రమే ఉందా?, ఎందుకు ఒకే పోస్టర్ ని తిప్పి తిప్పి వేస్తున్నారు అంటూ మూవీ టీం పై మండిపడుతున్నారు.

    అయితే ఇప్పటి వరకు చేసిన షూటింగ్ లో కేవలం ఆ ఒక్క సన్నివేశాన్ని మాత్రమే తెరకెక్కించారు అని, దీనితో పాటుగా హీరోయిన్స్ తో పలు సన్నివేశాలు షూట్ చేసారని టాక్. ఈ గ్లిమ్స్ ముందుగా ఈరోజు సాయంత్రం 6:03 నిమిషాలకు థియేటర్స్ లో ప్లే చెయ్యనున్నారు, ఆ తర్వాత 6 గంటల 30 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చెయ్యబోతున్నారు.