Trolls on Gambhir – Gill: క్రికెట్లో రాజకీయాలకు కొదవ ఉండదు. చట్టసభలకు మించి రాజకీయాలు క్రికెట్లో జరుగుతుంటాయి. ఇక మన దేశ క్రికెట్ సంఘంలో జరిగే రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఆటగాళ్లు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ జట్టులో ఉన్న రాజకీయాల వల్ల మరుగున పడిపోయారు. ఇక కొంతమంది ఆటగాళ్లు సరైన ఫామ్ లేకపోయినప్పటికీ వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ.. సంవత్సరాల జట్టులో పరాన్న జీవులుగా ఉన్నారు. వెనుకటి కాలమే కాదు.. ఇప్పటి కాలంలో కూడా క్రికెట్ బోర్డులో అడ్డగోలుగా రాజకీయాలు జరుగుతున్నాయి. చాలామంది అనా మక ప్లేయర్లు అవకాశాలు దక్కించుకుంటూ.. జట్టులో తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. అలాంటి ఆటగాళ్లకు మేనేజ్మెంట్ సహకారం ఉండడంతో వద్దన్నా కూడా అవకాశాలు లభిస్తున్నాయి.. చివరికి ఆ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అసలే ఇది సోషల్ మీడియా కాలం కాబట్టి .. అలా విఫలమవుతున్న ఆటగాళ్ల మీద విమర్శలు విపరీతంగా వ్యక్తమవుతున్నాయి.
టీమిండియా.. ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో 2024 నుంచి ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ముఖ్యంగా టీ 20 వరల్డ్ కప్ సాధించిన నాటి నుంచి పొట్టి ఫార్మాట్లో టీమిండియా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలు సాధిస్తూ అదరగొడుతోంది. 2024లో రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించగా.. అతడు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ టి20 జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి ఆధ్వర్యంలో టీమ్ ఇండియా వరుస ట్రోఫీలను సాధిస్తూ.. ర్యాంకింగ్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి టి20 జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారంతా కూడా సమష్టి ప్రదర్శన చేస్తూ టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాలను అందిస్తున్నారు.
టీమిండియా టి20 బండి సాఫీగా సాగుతున్న క్రమంలో ఒక్కసారిగా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన పైత్యాన్ని మొత్తం జట్టు మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టి20 జట్టులోకి గిల్ కు అవకాశం కల్పించాడు. వాస్తవానికి టి20 జట్టు పగ్గాలు కూడా గిల్ కు అందివ్వాలని గంభీర్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టెస్ట్, వన్డే బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి గిల్ కు అప్పగించాడు గౌతమ్ గంభీర్. గిల్ ఆధ్వర్యంలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సమం చేసింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేసింది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం టీమిండియా ఓడిపోయింది. ప్రస్తుతం 5 మ్యాచ్ ల టి20 సిరీస్ ను టీమిండియా ఆడుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే పై చెయ్యి సాధించింది. మరో మ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ దక్కించుకుంటుంది.
ఈ టోర్నీలో గిల్ కు అవకాశం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. గిల్ కోసం యశస్వి జై స్వాల్ ను కూడా పక్కన పెట్టాడు. అంతటి అవకాశం వచ్చినప్పటికీ గిల్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. గిల్ కు గంభీర్ వరుస అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. ఈ వీడియోలను చూసైనా గౌతం గంభీర్ మారతాడా? గిల్ ఆట తీరు మారుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Gambhir forcing Gill into T20I team pic.twitter.com/oBrSwmnhde
— Ritikardo DiCaprio (@ThandaPeg) November 6, 2025