The Girlfriend Movie Collection: ఈమధ్య కాలం లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇండియా వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద సంచనాలు నమోదు చేస్తున్నాయి. గత ఏడాది బాలీవుడ్ లో విడుదలైన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘స్త్రీ 2’ సింగిల్ లాంగ్వేజ్ నుండి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అదే విధంగా ఈ ఏడాది కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించిన ‘లోక: ది చాప్టర్ 1’ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక రీసెంట్ గా రష్మిక మందాన(Rashmika Mandanna) ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend Movie) చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. థియేటర్స్ లో విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం కేవలం నైజాం ప్రాంతం నుండే 4 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ‘ఘాటీ’ చిత్రానికి వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ కూడా ఇంత మొత్తంలో రాలేదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, 8 కోట్ల 38 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 27 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 7 కోట్ల రూపాయలకు జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన లాభాలు దాదాపుగా 7 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ ఉండే అవకాశం ఉండడం తో మరింత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.