Kaantha First Week Collections: ‘లక్కీ భాస్కర్’ వంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్ నుండి రీసెంట్ గా విడుదలైన చిత్రం ‘కాంతా'(Kantha Movie). రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ప్రముఖ తమిళ నటుడు/ సింగర్ త్యాగరాజా భాగవతార్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ సెల్వమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నుండి ఒక సినిమా విడుదల అవ్వబోతోంది అంటే కచ్చితంగా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి. రీసెంట్ గానే ఆయన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సీతారామం, కల్కి, మహానటి, లక్కీ భాస్కర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మన ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు కాబట్టి ఈ సినిమా కి మంచి ఓపెనింగ్ ఉంటుందని అనుకున్నారు. కానీ తీరా చూస్తే మొదటి ఆట నుండే టాక్ రాకపోవడం తో కలెక్షన్స్ బాగా దెబ్బ తిన్నాయి. విడుదలై వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టాయో ఒకసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి విడుదలకు ముందు 9 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. లక్కీ భాస్కర్ లాంటి భారీ హిట్ తర్వాత ఇంత తక్కువ బిజినెస్ జరిగింది ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది ఒక తమిళ డబ్ సినిమా, అందుకే ఇంత తక్కువ బిజినెస్ జరిగింది. అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి వారం లో 6 కోట్ల 25 లక్షలు గ్రాస్ వసూళ్లు, 3 కోట్ల 34 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి కోటి 55 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 27 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి కోటి 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం ఇంకా 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యం. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 9 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళ నుండి 4 కోట్ల 50 లక్షలు, కర్ణాటక నుండి 2 కోట్ల 45 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 55 లక్షలు, ఓవర్సీస్ నుండి 8 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 14 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.