AP BJP: ఏపీలో( Andhra Pradesh) బిజెపి బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టింది నాయకత్వం. ప్రస్తుతం ఏపీలో కూటమిలో భాగస్వామిగా ఉంది బిజెపి. కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఏపీలో బిజెపికి సీట్లతో పాటు ఓట్లు పెరిగాయి. దీనిని మరింతగా మెరుగుపరుచుకునేందుకుగాను నాయకత్వం దృష్టి పెట్టింది. అందుకే ఈనెల చివరి వారంలో ప్రాంతాలవారీగా శిక్షణ శిబిరాలను ప్రారంభించనుంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసినట్లు అవుతోంది. ఒకవైపు కూటమిగా ఉంటూనే.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. కొద్ది నెలల కిందట ఆయన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే ఆశించిన స్థాయిలో బిజెపి కార్యక్రమాలు నడవడం లేదన్న విమర్శ ఉంది. దానికి చెక్ చెబుతూ ఇప్పుడు శిక్షణ శిబిరాలను ప్రారంభించనున్నారు మాధవ్.
* పెరిగిన ప్రాతినిధ్యం..
ప్రస్తుతం బిజెపికి( Bhartiya Janata Party) ఏపీలో గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. ముగ్గురు ఎంపీలతో పాటు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక కేంద్రమంత్రి తో పాటు ఒక రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారు. ఆపై రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. బలమైన స్థితిలో కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే పార్టీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా బలోపేతం కావాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఓటు షేర్ తో పాటు సీట్ల సంఖ్య పెంచుకోవాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగా బలం మరింత విస్తృతం చేసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనంత ఎక్కువగా ప్రాతినిధ్యం పెంచుకోవాలన్న ఆలోచనలో ఉంది. అందుకే ఈ శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదం చేస్తాయని అభిప్రాయపడుతోంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం.
* క్యాడర్ బలోపేతానికి..
2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) , జనసేనతో కలిసి పోటీ చేసింది బిజెపి. పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 8, ఆరు పార్లమెంట్ స్థానాలకు గాను మూడు చోట్ల విజయం సాధించింది. అయితే బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఉండేవారు. ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలిచారు రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి. అయితే ఆమెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంతా భావించారు. అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆమె వైదొలి గారు. అయితే ఇంతవరకు పురందేశ్వరికి ఏ పదవి దక్కలేదు. ప్రస్తుతం బిజెపి సంస్థాగత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. పురందేశ్వరి పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో కొందరికి చోటు దక్కే అవకాశం ఉంది ఏపీ నుంచి. రాష్ట్ర మంత్రివర్గంలో సైతం మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నాయకత్వపరంగా బిజెపికి ఇబ్బంది లేకున్నా.. క్యాడర్ను బలోపేతం చేసుకోవడం ఇప్పుడు ఆ పార్టీ ప్రధాన కర్తవ్యం గా తెలుస్తోంది. అందుకే బిజెపి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.