Game changer and Devara : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కనీవినీ ఎరుగని రేంజ్ లో భారీగా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆలస్యంగా ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కాస్త ముందుగానే బుకింగ్స్ వదిలారు కానీ, తెలంగాణ లో మాత్రం సస్పెన్స్ నిన్న రాత్రి వరకు కొనసాగింది. అర్థ రాత్రి నుండి బుకింగ్స్ మొదలు పెట్టగా ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆన్లైన్ లో అర్థ రాత్రి నుండి అమ్ముడుపోయిన టికెట్ సేల్స్ లెక్కలు తీస్తే ప్రస్తుతానికి కేవలం హైదరాబాద్ లోనే 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. గంటల వ్యవధిలో ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా చూడలేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ మొదటి రోజుకి హైదరాబాద్ సిటీ నుండి 15 కోట్ల రూపాయలకు పైగా జరిగాయి. ‘గేమ్ చేంజర్’ కి రాత్రి సమయం అయ్యేసరికి ఆ రేంజ్ బుకింగ్స్ జరుగుతాయా?, లేదా అంతకంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందా అనేది చూడాలి. తెలంగాణ లో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ రామ్ చరణ్ కి గతం లో ఉండేవి కాదు. #RRR తర్వాత ఆయన రేంజ్ బాగా మారిపోయింది అనడానికి ఈ బుకింగ్స్ ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. కేవలం హైదరాబాద్ లోనే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇదే స్థాయి బుకింగ్స్ ఉన్నాయి. తమిళనాడు లో అయితే ‘దేవర’ చిత్రానికి ఫుల్ రన్ లో వచ్చిన గ్రాస్ ని ‘గేమ్ చేంజర్’ కేవలం మొదటి రోజే దాటేస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు అభిమానులు.
‘దేవర’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తమిళనాడు లో విడుదలకు ముందు రోజు కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటేసింది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వేరే లెవెల్ బ్యాటింగ్ ఈ ప్రాంతం లో ఉంటుందని, మొదటి రోజు కచ్చితంగా పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రం తమిళనాడు పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ ని పొందాలంటే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రానికి టాక్ వస్తే వంద కోట్ల రూపాయిల గ్రాస్ తమిళనాడు ప్రాంతం నుండి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కేవలం తమిళ వెర్షన్ బుకింగ్స్ మాత్రమే కాకుండా, తెలుగు వెర్షన్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి.