https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ కోసం రామ్ చరణ్ వదిలేసిన క్రేజీ మూవీ ఆ యంగ్ హీరో కెరీర్ ని మార్చబోతుందా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా కమిటెడ్ నటుడు. ఒక చిత్రానికి ఆయన డేట్స్ కేటాయిస్తే, ఆ సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చేందుకు తన వంతుగా ఎంత కష్టపడాలో, అంత కష్టపడతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 9, 2025 / 03:14 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చాలా కమిటెడ్ నటుడు. ఒక చిత్రానికి ఆయన డేట్స్ కేటాయిస్తే, ఆ సినిమా ఔట్పుట్ అద్భుతంగా వచ్చేందుకు తన వంతుగా ఎంత కష్టపడాలో, అంత కష్టపడతాడు. డైరెక్టర్ ఏమి చెప్తే అది చేస్తాడు. ఆయన ఎంత కమిట్ ఉన్న హీరో అనేది ఒక ఉదాహరణ ఉంది. ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం రామ్ చరణ్ మూడేళ్ళ తన విలువైన సమయాన్ని వెచ్చించాడు. రాజమౌళి సినిమాకి ఎవరైనా అన్ని డేట్స్ కావాలంటే కచ్చితంగా ఇచ్చేస్తారు. కానీ శంకర్ ప్రస్తుతం చాలా కష్టసమయం లో ఉన్నాడు. ఆయన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ముఖ్యంగా ఇండియన్ 2 కి ఎలాంటి ఫలితం వచ్చిందో మనమంతా చూసాము. ఈ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ స్థాయి హీరోలు ఎవ్వరూ కూడా శంకర్ కోసం అన్ని రోజులు డేట్స్ ఇవ్వడానికి సాహసించరు.

    కానీ రామ్ చరణ్ అన్ని డేట్స్ ఇవ్వడమే కాకుండా, ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని కూడా క్యాన్సిల్ చేసాడని నిన్న ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అయిన ‘అన్ స్టాపబుల్ ‘ లేటెస్ట్ ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇంతకు రామ్ చరణ్ వదిలేసిన సినిమా ఏమిటో తెలుసా..?. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మీ అందరికీ గుర్తు ఉండే ఉంటాడు. ఆయనతో రామ్ చరణ్ సినిమా ఒకటి అప్పట్లో ఖరారు అయ్యింది. షూటింగ్ వెంటనే ప్రారంభించాలి అనే రిక్వెస్ట్ నిర్మాతల వైపు నుండి ఉండడం తో, ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో అది కుదరదు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసాడు. ఇప్పుడు అదే స్టోరీ తో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవర కొండతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది.

    ‘గేమ్ చేంజర్’ కోసం రామ్ చరణ్ ఇలాంటి ప్రాజెక్ట్ ని వదులుకొని తప్పు చేశాడా?, లేదా సరైన నిర్ణయం తీసుకున్నాడా అనేది రేపు తెలుస్తుంది కానీ, విజయ్ దేవరకొండ కి మాత్రం ఆయన వదిలేసిన సినిమా వండర్స్ సృష్టించబోతోందా అని అనుకుంటున్నారు విశ్లేషకులు. గతం లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే పోకిరి సినిమాని వదిలేసుకోవాల్సి వచ్చింది, ఆ చిత్రం మహేష్ బాబు చేసి సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఆ రేంజ్ లో ఈ సినిమా కూడా విజయ్ దేవరకొండ కెరీర్ కి గేమ్ చేంజర్ గా నిలవబోతుందా లేదా అనేది చూడాలి. ఈ ఏడాది ద్వితీయార్థం లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి మార్చి 28 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే తేదీన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం వస్తుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు.