Vijay Deverakonda and Rashmika : టాలీవుడ్ లో చాలా కాలం నుండి ప్రముఖ యంగ్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandana), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మధ్య ప్రేమాయణం నడుస్తుంది, వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు ఎన్నో సందర్భాల్లో ప్రత్యక్షంగా మేము ప్రేమించుకుంటున్నాం అని చెప్పకపోయినా, పరోక్షంగా అభిమానులకు క్లూలు వదులుతూనే ఉన్నారు. ఇంకెన్ని రోజులు ఇలా దాగుడుమూతలు ఆడుతారు, బహిరంగంగా చెప్పేయొచ్చు కదా అని అభిమానులు కూడా వీళ్ళను ట్యాగ్ చేసి అడుగుతుంటారు. ఎన్నిసార్లు అడిగినా అటు వైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. రీసెంట్ గానే రష్మిక పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒమెన్ దేశానికీ వెళ్ళింది. అక్కడ సముద్రపు ఒడ్డున పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి.
ఇదంతా పక్కన పెడితే రష్మిక ఫోటోలు అప్లోడ్ చేసిన కాసేపటికి విజయ్ దేవరకొండ కూడా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుండి సముద్రపు ఒడ్డున ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇద్దరు కలిసి ఒకే ఫొటోలో కనిపించలేదు కానీ, వాళ్ళు అప్లోడ్ చేసిన ఫోటోలలో ఉన్న లొకేషన్స్ మాత్రం ఒకటే. అలా ఇద్దరి ఫోటోలను ట్యాలీ చేసుకొని వీళ్లిద్దరు కలిసి ఒమాన్ కి వెళ్లారంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు ఎన్నో సార్లు అభిమానులకు దొరికిపోయారు. కొంతమంది అయితే వీళ్లిద్దరు జిమ్ నుండి బయటకు వచ్చి ఒక కాఫీ షాప్ లో కూర్చొని కాఫీ తాగుతూ చిట్ చాట్ చేసుకుంటున్న సమయంలో ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. దీపావళి సెలబ్రేషన్స్ సమయంలో కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లోనే గత ఏడాది జరుపుకుంది.
ఇకపోతే రష్మిక కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ నుండి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక యానిమల్, చావా చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని అక్కడి ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఈ చిత్రాలు కాకుండా ‘పుష్ప’ సిరీస్ తో ఈమె బాలీవుడ్ లో సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన సికిందర్ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ, రష్మిక మాత్రం బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఆయన హీరో గా నటిస్తున్న ‘కింగ్డమ్’ కి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి అభిమానులు, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇస్తాడని అందరూ ఆశిస్తున్నారు.
Also Read : ఎఫైర్ రూమర్స్ మధ్య మరోసారి అందుకు కలిసిన విజయ్ దేవరకొండ-రష్మిక!