Tollywood: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ది మేనియా నే కనిపిస్తుంది. యూట్యూబ్ లో ఈ గ్లింప్స్ వీడియో కి 24 గంటల్లో 31 మిలియన్ వ్యూస్, 4 లక్షల 63 వేల లైక్స్ వచ్చాయి. వ్యూస్ విషయంలో టాలీవుడ్ టాప్ 1 గ్లింప్స్ వీడియో గా నిల్చిన ‘పెద్ది’ చిత్రం, లైక్స్ విషయంలో మాత్రం 8వ స్థానంలో నిల్చింది. ఓవరాల్ గా టాలీవుడ్ లో ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్ వీడియోస్ లో అత్యధిక లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read: తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్ స్టార్ హీరోల చేతుల్లోనే ఉందా..?
1) #TheyCallHimOG :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ని 2023 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్, మూవీ లవర్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లో ఈ గ్లింప్స్ వీడియో కి 7 లక్షల 31 వేల లైక్స్ వచ్చాయి.
2) భీమ్లా నాయక్:
పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ఇది. అంతటి భారీ అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం గింప్స్ వీడియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో కి 24 గంటల్లో 7 లక్షల 28 వేల లైక్స్ వచ్చాయి.
3) దేవర :
#RRR వంటి భారీ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నటించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అయితే విడుదలకు ముందు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో గ్లింప్స్ వీడియో ఆరోజుల్లో క్రియేట్ చేసిన హైప్ సాధారణమైనది కాదు. ఈ వీడియో కి 24 గంటల్లో 7 లక్షల 5 వేల లైక్స్ వచ్చాయి.
4) కల్కి 2898 AD(Kalki 2898 AD):
కల్కి చిత్రం పై కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం, ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోనే. 24 గంటల్లో ఈ వీడియో కి 6 లక్షల 64 వేల లైక్స్ వచ్చాయి.
5) #RRR :
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా గ్లింప్స్ వీడియో కి 24 గంటల్లో 6 లక్షల 22 వేల లైక్స్ వచ్చాయి.
6) పుష్ప 2 – ది రూల్(Pushpa 2 – The Rule) :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా గత ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి చేసుకున్న తర్వాత #WhereisPushpa అనే గ్లింప్స్ వీడియో ని విడుదల చేసారు. దీనికి 24 గంటల్లో 6 లక్షల 5 వేల లైక్స్ వచ్చాయి
7) ఉస్తాద్ భగత్ సింగ్ :
గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రకటించిన సినిమా ఇది. కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత, ఈ చిత్రం నుండి ఒక గ్లింప్స్ వీడియో విడుదల చేసారు మేకర్స్. దీనికి దాదాపుగా 4 లక్షల 88 వేల లైక్స్ వచ్చాయి.
ఇక 8వ స్థానం లో నిన్న విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ గ్లింప్స్ వీడియో నిల్చింది. కొత్త ఛానల్ లో విడుదల అవ్వడం వల్ల, కాస్త లైక్స్ తగ్గాయి కానీ, లేకుంటే కచ్చితంగా టాప్ 5 రేంజ్ లో ఉండేదని అంటున్నారు విశ్లేషకులు.