Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని గుర్తింపును సంపాదించి పెట్టిన చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే గత 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్లను సాధించిన సినిమాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఇక అందులో ఏ హీరో ఏ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని సాధించాడో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…2001 వ సంవత్సరం పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఖుషి (Khushi) సినిమా ఇండస్ట్రీ హిట్ అందుకుంది.2002వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర (Indra) సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక 2006వ సంవత్సరంలో వచ్చిన పోకిరి (Pokiri) సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత 2009వ సంవత్సరంలో రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర (Magadheera) సినిమా అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డు లను క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత బాహుబలి(Bahubali) సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడమే కాకుండా పాన్ ఇండియాలో ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారనే చెప్పాలి.
Also Read : పాన్ ఇండియా ఇండస్ట్రీ లో ఖాన్ త్రయం లా గుర్తింపు సంపాదించుకోబోతున్న ముగ్గురు తెలుగు హీరోలు వీళ్లేనా..?
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం(Rangasthalam ) సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించింది. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురం లో(Ala Vaikuntapuram lo) సినిమా సైతం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకోవడం విశేషం…
పుష్ప 2 (Pushpa 2) సినిమా భారీ విజయాన్ని సాధించి పెను రికార్డులను సైతం బ్రేక్ చేసి 1850 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ 25 సంవత్సరాలలో స్టార్ హీరోలందరూ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేస్తే ఎన్టీఆర్ మాత్రం ఒక ఇండస్ట్రీ హిట్ ను కూడా సాధించకపోవడం ఆయన చేసిన గమనార్హం.
ఆయన చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ దగ్గరే ఆగిపోతున్నాయి. మరి ఇండస్ట్రీ హిట్లు గా ఎందుకు కన్వర్ట్ కావడం లేదనే విషయమైతే ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇక మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అయినప్పటికి అతనికి భారీ కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…
Also Read : మన స్టార్ హీరోలు బిజీగా ఉండటం వల్ల తెలుగు డైరెక్టర్లతో సినిమాలు సెట్ చేస్తున్న తమిళ్ హీరో…