
Bigg Boss 5 Contestants Final List: బుల్లితెరపై తెలుగులో నంబర్ 1 రియాలిటీ షో ‘బిగ్ బాస్’.. ఐదో సీజన్ కు తాజాగా వేళైంది. ఈ బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దేశంలోని అన్ని భాషల్లోనూ సక్సెస్ అయిన ఈ రియాలిటీ షో.. తెలుగులో అన్నింటికంటే కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మిగిలిన ఇండస్ట్రీల్లో సాగుతున్న ‘బిగ్ బాస్’ షోలతో కంపేర్ చేస్తే.. తెలుగు షోనే ఎక్కువగా రేటింగ్ సాధించింది. అంతలా ప్రేక్షకులను ఆకర్షించిన ఈ షో.. టీఆర్పీ రేటింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇప్పటి వరకు నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 5వ సీజన్ కు రెడీ అవుతోంది. కరోనా లేకపోతే ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ఈ షో.. వాయిదాలు పడుతూ వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సెప్టెంబర్ 5వ తేదీన సీజన్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఇటీవలే స్టార్ మాటీవీ ప్రోమోలను విడుదల చేసింది.
ఇప్పటికే సెట్ నిర్మాణం పూర్తయ్యింది. కంటిస్టెంట్ల సెలక్షన్ కూడా పూర్తయ్యి వారిని క్వారంటైన్లోకి పంపారు. క్వారంటైన్ లో ఎవరున్నదానిపై ఇప్పటి వరకూ ఒక అంచనాకు సైతం జనాలు రాలేకపోతున్నారు.
. నాలుగో సీజన్ కంటిస్టెంట్ల ఎంపికపై విమర్శలు వచ్చాయి. ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారంతా ఎవరో తెలియదని, అలాంటి వారిని తీసుకొచ్చి పెట్టారనే అభిప్రాయం వ్యక్తమైంది. సెలబ్రిటీ గేమ్ షో మాదిరిగా లేదని కూడా అన్నారు. దీన్ని బట్టి ఈ సారి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.అందుకే సెలబ్రెటీలకే ఈసారి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది.
కరోనా థర్డ్ వేవ్ సూచనల నేపథ్యంలో ఈసారి సెప్టెంబర్ 5న ఖచ్చితంగా సీజన్ ను పట్టాలెక్కించాలని స్టార్ మా పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. దీనికోసం చాలా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా కంటెస్టెంట్లు అందరూ క్వారంటైన్ లో ఉన్నారని.. వారిని డైరెక్టుగా హౌస్ లోకి పంపిస్తారని అంటున్నారు. తాజాగా కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పేర్లు బయటకు వచ్చాయి.
-బిగ్ బాస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి సందడి చేసే కంటెస్టెంట్లు వీరేనని సమాచారం.
1. యాంకర్ రవి
2.యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్
3. టీవీ నటి నవ్యస్వామి
4. ఆర్జే కాజల్
5. కమెడియన్ లోబో
6. టీవీ నటి సిరి హన్మంతు
7. సీనియర్ నటి ప్రియ
8.కార్తీక దీపం ఫేమ్ ఉమ
9. యూట్యూబర్ సరయు
10.టీవీ నటుడు మానస్
11.మోడల్ జస్వంత్
12. టీవీ నటుడు సన్నీ
13.కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్
14.ఆర్జే ప్రియాంక (ట్రాన్స్ జెండర్)
15.టీవీ9 యాంకర్ ప్రత్యూష
16. కొరియో గ్రాఫర్ ఆట సందీప్ లేదా రఘు మాస్టర్