Homeఎంటర్టైన్మెంట్Mirzapur Web Series : ఆ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సినిమా రూపంలో, మైండ్...

Mirzapur Web Series : ఆ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సినిమా రూపంలో, మైండ్ బ్లోయింగ్ అప్డేట్!

Mirzapur Web Series :  ఈ మధ్య సినిమాలకు మించిన ఆదరణ డిజిటల్ సిరీస్లకు దక్కుతుంది. క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డిజిటల్ కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ముఖ చిత్రం మార్చేసింది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలను ఆడియన్స్ కి మాత్రమే డిజిటల్ కంటెంట్, ఫ్లాట్ ఫార్మ్స్ పట్ల అవగాహన ఉండేది. కరోనా తర్వాత పల్లె ప్రాంతాల ప్రేక్షకులు కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి అలవాటు పడ్డారు. వివిధ దేశాల, భాషల కంటెంట్ ఇంట్లో కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

కాగా ఓ బ్లాక్ బస్టర్ సిరీస్ ని సినిమా రూపంలో తేవడం చర్చకు దారి తీసింది. 2018లో విడుదలైన మీర్జాపూర్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. క్రైమ్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఫస్ట్ సీజన్ 9 ఎపిసోడ్స్ తో 2018లో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి తెచ్చారు. మీర్జాపూర్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, విక్రాంత్ మాసే, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రలు చేశారు.

సీజన్ వన్ సక్సెస్ నేపథ్యంలో 2020లో సీజన్ 2 అందుబాటులోకి తెచ్చారు. సీజన్ 2 సైతం ఆదరణ పొందింది. 2024లో సీజన్ 3 సైతం 10 ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మూడు సీజన్స్ ఆదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో మీర్జాపూర్ సిరీస్ ని సినిమా రూపంలో అందుబాటులోకి తేవాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. మిర్జాప్పోర్ మూడు సీజన్స్ కి దర్శకత్వం వహించిన గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.

ఈ క్రమంలో అనౌస్మెంట్ వీడియో విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన వీడియో ఇంటెన్స్, క్రైమ్ సీన్స్ తో సాగింది. సిరీస్ తరహాలో సినిమా కూడా హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. మీర్జాపూర్ చిత్రాన్ని రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి,అలీ ఫజల్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. అనౌన్స్మెంట్ వీడియో ఆకట్టుకుంది.

Mirzapur The Film | Announcement | Pankaj Tripathi | Ali Fazal | Divyenndu | Abhishek Banerjee

Exit mobile version