Shobhitha Dulipalla : ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెళ్ళాడి, ఆ ఇంటి కోడలిగా అడుగుపెట్టి కనీసం రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే శుభవార్త ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పంచుకుంది. ఇంస్టాగ్రామ్ లో మొదటి నుండి యాక్టీవ్ గా ఉంటూ స్టోరీలు, రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఉండే శోభిత, తన అకౌంట్ ద్వారా ఏ పోస్ట్ వేసిన క్షణాల్లో రీచ్ అయిపోతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఆమె చెప్పిన శుభవార్త కూడా సోషల్ మీడియా అంతటా వ్యాప్తి చెందింది. శుభవార్త అంటే మీరు అనుకునే శుభవార్త కాదు. ఆమె హీరోయిన్ గా నటించిన ‘ది మంకీ మ్యాన్’ అనే చిత్రానికి సంబంధించిన శుభవార్త. ఈ సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ లో నామినేషన్స్ ని సంపాదించుకుంటూ సంచలనం సృష్టించింది. రీసెంట్ గానే ఈ చిత్రానికి ప్రతిష్టాత్మక బాఫ్తా లో బెస్ట్ యాక్షన్ & అడ్వెంచర్ మూవీస్ క్యాటగిరీలో చోటు సంపాదించుకుంది.
అంతే కాకుండా ‘రాటెన్ టొమోటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీ’ గా అగ్రస్థానంలో నిల్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ ‘ఇది కలనా నిజామా అనే ఆశ్చర్యంలో ఉన్నాను. నేను నటించిన సినిమా అంతర్జాతీయ అవార్డ్స్ నామినేషన్స్ లో చోటు సంపాదించుకుంది. మంకీ మ్యాన్ చిత్రం 2024 బాఫ్తా యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఎంపికైంది. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను’ అంటూ ఆమె ఒక పోస్ట్ ని పబ్లిష్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు. పెళ్ళైన తర్వాత మొట్టమొదటి శుభం జరిగింది, ఇక నుండి అన్ని ఇలాంటివే జరుగుతాయి అంటూ ఆశీర్వదించారు. తెనాలి లో పుట్టి, అక్కడే విద్యాబ్యాసం చేసి , వైజాగ్ లో స్థిరపడిన శోభిత, సినిమాల మీద మక్కువతో మోడలింగ్ రంగం లో అడుగుపెట్టి మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది.
ఇక ఆ తర్వాత ఈమెకు మొట్టమొదటిసారి అడవిశేష్ హీరో గా నటించిన ‘గూఢచారి’ చిత్రం లో హీరోయిన్ గా చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో తెలుగు లో అవకాశాలు వచ్చాయి కానీ, తెలుగు కంటే హిందీ లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. అలా హిందీ లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ నేషనల్ వైడ్ గా పాపులారిటీ ని దక్కించుకున్న ఈమె, నాగ చైతన్య తో ప్రేమాయణం ఎలా నడిపిందో ఇప్పటికీ ఎవరికీ తెలియని మిస్టరీ గానే మిగిలిపోయింది. తెలుగులో ఈమె గూఢచారి తర్వాత మేజర్ అనే చిత్రం లో మాత్రమే నటించింది. నాగ చైతన్య తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇదంతా పక్కన పెడితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుందట. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దొరికినప్పుడే నటిస్తుందట.