Rinku Singh engagement: టీమిండియా యువ ఆటగాడు.. టీ -20 స్పెషలిస్ట్ బ్యాటర్ (T20 specialist batter) రింకూ సింగ్(Rinku Singh) ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు.. అదికూడా రహస్యంగా చేసుకున్నట్టు శుక్రవారం ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రింకూ సింగ్(Rinku Singh) పార్లమెంట్ సభ్యురాలు(member of parliament) ప్రియా సరోజ్ (Priya Saroj)తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు శుక్రవారం నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రియా సరోజ్ తో రింకూ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతాడని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి రకరకాల పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ తొలిసారిగా నోరు చెప్పారు. ప్రియా సరోజ్, రింకూ సింగ్ సీక్రెట్ ఎంగేజ్మెంట్ వార్తలు పుకార్లు మాత్రమేనని.. వాటిని ఎవరూ నమ్మొద్దని సూచించారు. ” ప్రియా ఎంగేజ్మెంట్ రింకూ సింగ్ తో జరగలేదు. ఆ వార్తలు నిజం కాదు. అవన్నీ పూర్తి నిరాధారమైనవి. పెళ్లి సంబంధానికి సంబంధించి రెండు కుటుంబాల మధ్య చర్చలు మాత్రం జరిగాయి. ఇది మాత్రం నిజం. కానీ ఎంగేజ్మెంట్ దాకా అది వెళ్లలేదు. ఎంగేజ్మెంట్ జరిగింది.. త్వరలో పెళ్లికూడా జరుగుతుందనే వార్తలు నిజం కావు. వాటిని ఎవరూ నమ్మొద్దని” తుఫాని సరోజ్ పేర్కొన్నారు. ” ఎవరో గాలి వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. అవి వాస్తవం ఎలా అవుతాయి? ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండా మీడియా కూడా తెగ ప్రచారం చేస్తోంది. వాస్తవాలను పక్కనపెట్టి కల్పితాలకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తోందని” తుఫాని సరోజ్ మండిపడ్డారు.
ప్రియా సరోజ్ నేపథ్యం ఇది
ప్రియా సరోజ్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమె రాజకీయవేత్త, న్యాయవాది కూడా. సమాజ్ వాదీ పార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 10 సంవత్సరాల వయసులోనే పార్లమెంట్ లో ప్రవేశించారు. అత్యంత చిన్న వయసులో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన యువతిగా ప్రియా రికార్డు సృష్టించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆమె మచ్ లిష హర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన ప్రత్యర్థి, బిజెపి సీనియర్ నాయకుడు బిపి సరోజ్ ను ఓడించారు. అంతేకాదు తనకు అనాదికాలంగా వస్తున్న రాజకీయ వారసత్వాన్ని ఆమె నిలబెట్టుకున్నారు.. ప్రియా ఎంపీగా గెలవడానికి ముందు న్యాయవాద వృత్తి స్వీకరించారు. కొన్ని రోజులపాటు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పని చేశారు. ప్రియా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆమెది రాజకీయ కుటుంబం. తండ్రి తుఫాని సరోజ్ రాజకీయ నాయకుడు.. ప్రియ గెలిచిన నియోజకవర్గం నుంచి మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన విజయం సాధించారు.. 1999, 2004, 2009లో ఆయన ఎంపీగా పొందారు. మూడుసార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్స్ సాధించారు.. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.
రింకూ సింగ్ ప్రయాణం ఇలా..
రింకూ సింగ్ టి20 క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని అలీగడ్ ప్రాంతంలో ఉపయోగ కుటుంబంలో అతడు జన్మించాడు. క్రికెట్లో శిక్షణ పొందేందుకు చాలా కష్టపడ్డాడు. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్ లో విజయవంతమైన తర్వాత.. అతడు జీవితం సరికొత్త మలుపులు తీసుకుంది. ఇటీవల కోల్ కతా జట్టు అతడిని రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత అతడు ఒక అధునాతనమైన ఇంటిని కొనుగోలు చేశాడు.. ఇక త్వరలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు రింకూ సింగ్ కు చోటు లభించింది.