Karan Nair: మెరుగ్గా ఆడ లేకపోవడంతో అతడికి జట్టులో స్థిరత్వం అంటూ లేకుండా పోయింది. డొమెస్టిక్ క్రికెట్ లో అప్పుడప్పుడు గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ నేషనల్ టీం లో మాత్రం అతడికి స్థానం లభించలేదు. కానీ 2024-25 సీజన్లో మాత్రం అతడు బీభత్సంగా ఆడుతున్నాడు. జాతీయ జట్టులోకి రావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు అతని బ్యాటింగ్ స్టైల్ చూసిన సెలెక్టర్లు వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం నాయర్ వయసు 33 సంవత్సరాలు. అయినప్పటికీ యువ ఆటగాళ్లకు పోటీ ఇస్తున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే టోర్నీలో ఏడు మ్యాచ్లలో 752 రన్స్ చేశాడు. వన్డే ఫార్మేట్ లో ఇంత స్థిరంగా అతడు ఆడటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతడు ఆరు ఇన్నింగ్స్ లలో ఐదు సెంచరీలు చేశాడు. 112*, 44*, 163*, 112, 122*, 88* ఇలా అతడు తన చివరి ఆరు ఇన్నింగ్స్ లలో పరుగులు చేశాడు. పరుగులు చేయడమే కాదు.. బౌలర్లకు సింహ స్వప్నం లాగా మిగులుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్ లో పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.. ఇక విజయ్ హజారే టోర్నీలో హైయెస్ట్ స్కోర్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ (660) రికార్డును కూడా నాయర్ బద్దలు కొట్టాడు.. ఈ టోర్నీలో హైయెస్ట్ సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు.. దీనికంటే ముందు జరిగిన కర్ణాటక మహారాజా టి20 12 మ్యాచ్లలో 560 రన్స్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 6 ఇన్నింగ్స్ లలో 255 రన్స్ చేశాడు. గత ఏడాది కౌంటిలలో నార్తాంప్టన్ షైర్ జట్టుకు ఆడిన నాయర్.. 487 రన్స్ చేశాడు. గత రంజీలో 10 మ్యాచ్లలో 690 పరుగులు చేశాడు. అతడి దూకుడు వల్ల విదర్భ ఫైనల్ వెళ్ళింది.
చోటు దక్కుతుందా
గతంలో నాయక్ త్రిబుల్ సెంచరీ చేసింది ఇంగ్లాండ్ జట్టు మీదే. ప్రస్తుతం భారత టెస్టు జట్టు కూర్పు సరిగ్గా లేదు. సీనియర్ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం లేదు. యువ ఆటగాళ్లు మెరుగ్గా ఆడటం లేదు. అందువల్లే కరణ్ నాయర్ కు ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టులో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే కరణ్ బ్యాక్ ఫుట్ పై అద్భుతంగా ఆడతాడు. అతని నైపుణ్యం జట్టుకు లాభం చేకూర్చుతుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు కూడా అవకాశాలు ఇస్తే రాణించిన సందర్భాలు ఉన్నాయి. అదే సూత్రాన్ని కరణ్ విషయంలో బీసీసీఐ పాటిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. “టెస్ట్ క్రికెట్ జట్టులో ఇలాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. అప్పుడే జట్టు బలం సమతూకంగా ఉంటుంది. అప్పుడు జట్టు విజయాలు సాధించగలుగుతుంది. ఇలాంటి ప్రయోగాలకు కొంతకాలంగా టీమిండియా దూరంగా ఉండడం వల్లే వరుస ఓటములు ఎదురవుతున్నాయి. అవి జరగకూడదనుకుంటే కచ్చితంగా కరణ్ లాంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.