https://oktelugu.com/

Pushpa 2 : ‘పుష్ప 2’ చిత్రానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం..? రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తూ తెలుగోడి సత్తా చాటుతున్న అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2 : ది రూల్' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మన ఇండియన్ సినిమా ఎన్నడూ చూడని వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 13, 2024 / 08:28 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మన ఇండియన్ సినిమా ఎన్నడూ చూడని వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి, కల్కి తరహా భారీ బడ్జెట్ గ్రాండియర్ చిత్రాలకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ ఒక మామూలు కమర్షియల్ సినిమాకి వెయ్యి కోట్లు రావడం, అది కూడా మొదటి వారంలోనే అవ్వడం, నిజంగా అల్లు అర్జున్ ఊర మాస్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. పుష్ప సిరీస్ లో కథ చాలా మామూలే. కేవలం అల్లు అర్జున్ నటన, మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ వంటివి మాత్రమే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. అవే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రికార్డ్స్ ని తెచ్చిపెట్టడానికి కారణం అయ్యాయి. అల్లు అర్జున్ కి అందుకే పార్ట్ 1 కి ఉత్తమ నటుడి క్యాటగిరీ లో నేషనల్ అవార్డు వచ్చింది.

    ఇప్పుడు పార్ట్ 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణం కూడా అల్లు అర్జున్ మాత్రమే. ఎందుకంటే పార్ట్ 1 క్లైమాక్స్ లో పార్ట్ 2 కి బాహుబలి, కేజీఎఫ్ తరహాలో గొప్ప లీడింగ్ ఏమి ఇవ్వలేదు డైరెక్టర్ సుకుమార్. కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ నచ్చబట్టే, రెండవ పార్ట్ కోసం ఆడియన్స్ ఎదురు చూసారు. ఆ యాటిట్యూడ్ మొదటి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు చూపించాడు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి ప్రకంపనలు వచ్చాయి. నిజానికి ఒక కమర్షియల్ సినిమాకి మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప విజయం ఇది. కచ్చితంగా దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

    భారతదేశ సినీ చరిత్రలో, భవిష్యత్తులో మొదటి వారం లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే సినిమాలు రావొచ్చు. కానీ మొట్టమొదటగా ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా గురించి మన తర్వాతి తరం వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కడానికి ఈ సినిమాకి కచ్చితంగా అర్హత ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి మేకర్స్ ఆ ప్రయత్నం చేస్తారా?, చేస్తే కచ్చితంగా దీనిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఈసారి నేషనల్ అవార్డుని కాదు, అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ పై కన్నేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’ చిత్రాన్ని ఆస్కార్స్ కి పంపేందుకు మూవీ టీం ప్రయత్నాలు చేస్తుందట. అదే కనుక జరిగితే అల్లు అర్జున్ ఉత్తమ నటుడి క్యాటగిరీలో నామినేషన్ ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అభిమానులు ఈ సినిమా సాధిస్తున్న రికార్డ్స్ ని చూస్తున్నారు, భవిష్యత్తులో రాబోయే రివార్డ్స్ చూస్తే మెంటలెక్కిపోతారంటూ విశ్లేషకులు చెప్తున్నారు.