https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అవినాష్ కి గొప్ప గౌరవం ఇచ్చిన బిగ్ బాస్..అదిరిపోయిన AV వీడియో..కమెడియన్ కాదు..హీరో అని నిరూపించిన బ్లాక్ బస్టర్ జర్నీ!

అవినాష్ అంటే ఫ్లవర్ కాదు..ఫైర్..వైల్డ్ ఫైర్ అని తన ఆట తీరుతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం అయ్యేలా చేసాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అవ్వడం వల్ల అతనికి ఆడియన్స్ లో సరైన ఓటు బ్యాంక్ ఏర్పడలేదు. ఆ కారణం చేత ఒక ఎలిమినేట్ అవుతాడు. నబీల్ ఏవిక్షన్ షీల్డ్ ని ఉపయోగించడం వల్ల సేవ్ అయ్యాడు.

Written By:
  • Vicky
  • , Updated On : December 13, 2024 / 08:31 AM IST

    Avinash AV

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ బిగ్ బాస్ సీజన్ డిజాస్టర్ అవ్వకుండా కాపాడిన కంటెస్టెంట్స్ లో అవినాష్ ఒకడు. జనాలు బిగ్ బాస్ రియాలిటీ షో చూడాలంటే బీభత్సమైన గొడవలు ఉండాలి, లేదా కడుపుబ్బా నవ్వేలా ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఈ రెండు హౌస్ లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ ఇవ్వలేకపోయారు. కానీ వైల్డ్ కార్డ్స్ గా అడుగుపెట్టిన అవినాష్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తే, గౌతమ్ అన్ లిమిటెడ్ గూస్ బంప్స్ రప్పించే గేమ్ ప్లే ఇచ్చాడు. వీళ్లిద్దరి కారణంగానే సీజన్ ఫ్లాప్ అవ్వకుండా, పర్వాలేదు అనే రేంజ్ లో వెళ్ళింది. ఇక అవినాష్ విషయానికి వస్తే ఇతను కమెడియన్, కామెడీ తప్ప ఏమి చెయ్యలేడు, టాస్కులు ఆడే సత్తా ఇతనిలో లేదు అని హౌస్ లో చాలా మంది ఇతన్ని ఘోరంగా అవమానించాడు. అలాంటి వాళ్లందరికీ తన మాటలతో కాదు, చేతలతో చేసి చూపించాడు. తాను కామెడీ ని పంచగలను, టాస్కులు కూడా అద్భుతంగా ఆడగలను అని నిరూపించి చూపాడు.

    అవినాష్ అంటే ఫ్లవర్ కాదు..ఫైర్..వైల్డ్ ఫైర్ అని తన ఆట తీరుతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అర్థం అయ్యేలా చేసాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అవ్వడం వల్ల అతనికి ఆడియన్స్ లో సరైన ఓటు బ్యాంక్ ఏర్పడలేదు. ఆ కారణం చేత ఒక ఎలిమినేట్ అవుతాడు. నబీల్ ఏవిక్షన్ షీల్డ్ ని ఉపయోగించడం వల్ల సేవ్ అయ్యాడు. అంతకు ముందు ఆయన ఒకసారి మెగా చీఫ్ అయ్యాడు. ఏవిక్షన్ షీల్డ్ ద్వారా సేవ్ అయ్యాక మరోసారి కూడా మెగా చీఫ్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 హిస్టరీ లో రెండు సార్లు మెగా చీఫ్ అయిన ఏకైక కంటెస్టెంట్ అవినాష్ మాత్రమే. ఎదో లక్ వల్ల ఆయన మెగా చీఫ్ అవ్వలేదు, నిఖిల్, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, రోహిణి ఇలా ఎంతో మంది హేమాహేమీలను ఓడించి అయ్యాడు.

    ఈ సీజన్ లో నిఖిల్ ఆడిన ప్రతీ టాస్క్ గెలిచాడు, 100 శాతం స్ట్రైక్ రేట్ అని అందరూ అంటూ ఉండేవారు. అలాంటి నిఖిల్ తో ఇతను మూడు సార్లు తలపెడితే, మూడు సార్లు ఓడించాడు. టికెట్ టు ఫినాలే టాస్కులో అవినాష్ తలపడింది నిఖిల్ తోనే. ఎంత తెలివితో ఆడి టికెట్ ని గెలిచాడో మనమంతా చూసాము. తన సొంత కష్టంతోనే నేడు ఆడియన్స్ సపోర్టు లేకపోయినా టాప్ 5 వరకు వచ్చాడు. తన సొంత కష్టం తో పాటు అవినాష్ కి అదృష్టం కూడా కలిసొచ్చింది. నిజాయితీగా నడుచుకునే వాళ్లకు దేవుడు అన్ని విధాలుగా తోడు ఉంటాడు అని చెప్పడానికి అవినాష్ బిగ్ బాస్ జర్నీ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఆయన లాంటి ఎంటర్టైనర్ మళ్ళీ దొరకడు. ప్రతీ సీజన్ కి బిగ్ బాస్ అవినాష్ ని తెచ్చుకోవాలి. ఆ స్థాయిలో ఈ సీజన్ లేపి వదిలాడు అవినాష్.