https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నబీల్ చేతుల్లోకి వెళ్లిన ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’..ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..నభీల్ ఎవరిని సేవ్ చేస్తాడు?

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ దాదాపుగా ఖరారు అయ్యినట్టే అట. నిన్న రాత్రి హౌస్ లో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గేమ్ ని నిర్వహించాడు బిగ్ బాస్. ఈ గేమ్ మొదలయ్యే ముందు మెగా చీఫ్ ప్రేరణకి బిగ్ బాస్ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గేమ్ నుండి 5 మందిని తప్పించమని ఆదేశించగా, ఆమె పృథ్వీ, గౌతమ్, విష్ణు ప్రియ, హరితేజ, గంగవ్వ ని తొలగిస్తుంది

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 08:03 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు నామినేట్ అయిన 7 మంది కంటెస్టెంట్స్ లో నిఖిల్, గౌతమ్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా, డేంజర్ జోన్ లో ఏకంగా నలుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే పృథ్వీ, విష్ణు ప్రియ, యష్మీ , హరితేజ. వీరిలో హరి తేజ కాస్త ఓటింగ్ శాతం తేడా తో చివరి స్థానం లో కొనసాగుతుండగా, యష్మీ ఆమె ముందు స్థానంలో కొనసాగుతుంది. వీళ్లిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ దాదాపుగా ఖరారు అయ్యినట్టే అట. నిన్న రాత్రి హౌస్ లో ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ ని నిర్వహించాడు బిగ్ బాస్. ఈ గేమ్ మొదలయ్యే ముందు మెగా చీఫ్ ప్రేరణకి బిగ్ బాస్ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ నుండి 5 మందిని తప్పించమని ఆదేశించగా, ఆమె పృథ్వీ, గౌతమ్, విష్ణు ప్రియ, హరితేజ, గంగవ్వ ని తొలగిస్తుంది.

    ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఈ గేమ్ లో పాల్గొనగా, నభీల్ కి ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ దక్కుతుంది. ఈ వారం గంగవ్వ తనకి తాను ఆరోగ్య సమస్యల కారణంతో ఎలిమినేట్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండదు. ఒకవేళ ఆమె వెళ్లకపోతే మాత్రం యష్మీ, హరితేజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ప్రమాదం ఉంది. వీళ్లిద్దరు మంచి కంటెంట్ ఇచ్చే ఆటగాళ్లు, మంచి గేమర్స్ కూడా. కానీ నభీల్ చేతిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. ఇదే ఇక్కడ వచ్చిన అసలు సమస్య. నభీల్ కి యష్మీ, హరితేజ ఇద్దరితో కూడా ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ లేదు. ఎవరికీ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ ఉపయోగిస్తావు అని అడిగితే ‘నేను ఎవరికీ ఉపయోగించను సార్’ అని చెప్పొచ్చు. ఒకవేళ ఓజీ క్లాన్, మొదటి నుండి గేమ్స్ ఆడుతూ వచ్చిన అమ్మాయి కదా, అని పాత డీల్ కి కట్టుబడి ఆయన యష్మీ ని సేవ్ చేస్తే చేయొచ్చు, కానీ ఎక్కువ శాతం నభీల్ ఆ విధంగా ఆలోచించే ప్రయత్నం చేయకపోవచ్చు.

    నిఖిల్ నభీల్ వద్దకు వెళ్లి యష్మీ ని ఎలిమినేట్ చేయొద్దు అని బ్రతిమిలాడి, అతనితో డీలింగ్ సెట్ చేసుకుంటే ఏదైనా అవకాశం ఉండొచ్చేమో కానీ, సాధ్యమైనంత వరకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని నభీల్ ఉపయోగించకపోవచ్చు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ని రద్దు చేసి, గంగవ్వ ని హౌస్ నుండి పంపి, చివర్లో డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయమని ఆప్షన్ ఇస్తే నభీల్ హరితేజ ని సేవ్ చేసిన చేయొచ్చు. అలా చేస్తే హరితేజ సేవ్ అవుతుంది. ఆడియన్స్ ఓట్ల ద్వారా యష్మీ ఎలాగో సేవ్ అయ్యింది కాబట్టి ఆమెని ఎలిమినేట్ అవ్వదు. ఇలా చేస్తే మాత్రం వచ్చే వారం టీఆర్ఫీ రేటింగ్స్ దద్దరిల్లిపోతుంది. అలా కాకుండా యష్మీ, హరితేజ ని డబుల్ ఎలిమినేషన్ ద్వారా బయటకి పంపి, గంగవ్వ ని హౌస్ లో ఉంచితే మాత్రం ఇక బిగ్ బాస్ చూడడం ఆడియన్స్ ఆపేయొచ్చు.