https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హిస్టరీ లోనే సేఫ్ ప్లేయర్ గా నిల్చిన నభీల్..పాతాళంలోకి పడిపోయిన గ్రాఫ్..టాప్ 5 కూడా కష్టమే!

ప్రతీ ఒక్కరితో టాస్కులు ప్రారంభం అయ్యే ముందు డీలింగ్స్ నభీల్ అనే ముందుగా సెట్ చేసుకుంటాడు, చివరికి పరిస్థితులు తారుమారు అయ్యి ఏదైనా తేడా జరిగితే వాళ్ళ మీద పీకల దాకా కోపం పెంచేసుకొని, వాళ్ళను ఓడించేందుకు గేమ్ ఆడుతాడు. గత నాలుగు వారాలుగా నభీల్ గేమ్ ఇలాగే సాగుతుంది. నామినేషన్స్ లో 5 వారాల నుండి లేడు కాబట్టి, కచ్చితంగా అతని ఓటింగ్ గ్రాఫ్ తగ్గుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 7:58 am
    Bigg Boss Telugu 8

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ ప్రారంభం నుండి మన అందరికీ టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా అనిపించిన వ్యక్తి నభీల్. మొదటి వారం నుండి ఈయన నిఖిల్, పృథ్వీ లతో సమానంగా టాస్కులు ఆడుతూ టైటిల్ రేస్ లో నిలబడ్డాడు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టారో, అప్పటి నుండి నభీల్ మాస్క్ తొలగిపోయింది. చూసే ప్రతీ ప్రేక్షకుడికి నభీల్ లాంటి సేఫ్ ప్లేయర్ ని బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అని అనిపించింది. నామినేషన్స్ అంటే వణికిపోతున్నాడు. ఇతన్ని ఎవరైనా నామినేట్ చేస్తే వాళ్ళ మీద పగ పెంచేసుకుంటున్నాడు. ప్రతీ ఒక్కరితో టాస్కులు ప్రారంభం అయ్యే ముందు డీలింగ్స్ ఇతనే ముందుగా సెట్ చేసుకుంటాడు, చివరికి పరిస్థితులు తారుమారు అయ్యి ఏదైనా తేడా జరిగితే వాళ్ళ మీద పీకల దాకా కోపం పెంచేసుకొని, వాళ్ళను ఓడించేందుకు గేమ్ ఆడుతాడు. గత నాలుగు వారాలుగా నభీల్ గేమ్ ఇలాగే సాగుతుంది. నామినేషన్స్ లో 5 వారాల నుండి లేడు కాబట్టి, కచ్చితంగా అతని ఓటింగ్ గ్రాఫ్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు అతని ఆట తీరు కారణంగా గ్రాఫ్ ఇంకా తగ్గిపోయి పాతాళంలోకి పడిపోయింది.

    ఇప్పడు నభీల్ టాప్ 5 లోకి రావడం కూడా కష్టమే, అలా ఉంది పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే నభీల్ గేమ్ ఎంత చెత్తగా ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ‘మెగా చీఫ్’ కంటెండర్ టాస్క్ ఒక ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ గార్డెన్ ప్రాంతం లో కొన్ని మూటలు పెడుతాడు. మెగా చీఫ్ కంటెండర్లుగా నిల్చిన పృథ్వీ, రోహిణి, యష్మీ, నభీల్, ప్రేరణలకు 5 బాక్సలు ఇచ్చి అందులో కూర్చోమంటాడు బిగ్ బాస్. ఆ 5 మందిలో ఎవరికైతే మెగా చీఫ్ అవ్వడం ఇష్టం లేదో, వాళ్ళు ఉండే బాక్సులో మూటలు వేయాలి. ఎవరి బాక్స్ లో ఎక్కువ మూటలు ఉంటాయో, వాళ్ళు మెగా చీఫ్ రేస్ నుండి ఒక్కొక్కరిగా తప్పుకుంటారు. ఈ టాస్క్ ప్రారంభం అయ్యే ముందు నభీల్ పృథ్వీ తో ఒక డీలింగ్ పెట్టుకుంటాడు. నేను ముందుగా బయటకి వస్తే నీకు సపోర్టు చేస్తాను, నువ్వు ముందుగా బయటకి వస్తే నాకు సపోర్ట్ చేయి అని నభీల్ అంటాడు, దానికి పృథ్వీ ఓకే చెప్తాడు.

    తనకి సపోర్టు చేస్తున్న హౌస్ మేట్స్ కి పృథ్వీ ‘నభీల్ బాక్సులో మూటలు వేయకండి’ అని అంటాడు. పృథ్వీ అలా చెప్పడం నభీల్ కూడా వింటాడు. కానీ పృథ్వీ కి సపోర్టు చేసేవాళ్ళు మాత్రం ‘నభీల్ నీకు సపోర్టు చేస్తాడని మాకు నమ్మకం లేదు’ అని నభీల్ బాక్స్ లో మూటలు వేస్తాడు. దీంతో పగ పెంచుకున్న నభీల్, పృథ్వీ కి ఇచ్చిన మాటని కూడా పక్కకు పెట్టి, అతని బాక్స్ లో మూటలు వేస్తాడు. అతన్ని తప్పించేవరకు కసిగా ఆడుతాడు. పృథ్వీ కి కూడా కోపం నషాలం కి తాకుతుంది. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయిలో జరుగుతుంది. ఇది మనం ప్రోమో లో చూడొచ్చు. నభీల్ ఎంత చెత్త గేమ్ ఆడుతున్నాడో రేపు లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకు అర్థం అవుతుంది. దీంతో అతని మరింత దిగజారే అవకాశం కూడా ఉంది.