https://oktelugu.com/

Akhanda 2 Story: ‘అఖండ 2’ స్టోరీ మొత్తం లీక్.. ఇదే కనుక నిజమైతే ఒక్క రికార్డ్ కూడా మిగలదు

న్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అయితే అఖండ 2 స్టోరీ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ మారింది. ఈ సినిమా మొత్తం దేవాలయాలపై జరుగుతున్నా దాడుల గురించి చూపించబోతున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను.

Written By:
  • Vicky
  • , Updated On : May 3, 2023 / 06:14 PM IST
    Follow us on

    Akhanda 2 Story: నందమూరి బాలకృష్ణ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.ఇక ఆయన కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్న ప్రతీ సారీ ఇండస్ట్రీ షేక్ అయ్యే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వడం బాలయ్య స్టైల్. ‘అఖండ’ సినిమాకి ముందు బాలయ్య కెరీర్ ఏ రేంజ్ లో పడిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కనీసం పది కోట్ల రూపాయిల షేర్ కలెక్షన్స్ ని కూడా రాబట్టలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయం లో వచ్చిన అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

    ఈ చిత్రం అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదలైనప్పటికీ 70 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను సాధించింది, ఇది బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు, టికెట్ రేట్స్ కాస్త మెరుగ్గా ఉంది ఉంటే, ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టేదని విశ్లేషకుల అభిప్రాయం.

    అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ కి త్వరలోనే సీక్వెల్ రాబోతుంది.త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అయితే అఖండ 2 స్టోరీ సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ మారింది. ఈ సినిమా మొత్తం దేవాలయాలపై జరుగుతున్నా దాడుల గురించి చూపించబోతున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను.

    ఇతర మతం లో ఉన్న రాజకీయ నాయకుడు అధికారం లోకి వచ్చిన తర్వాత మాత కల్లోలాలు సృష్టించి, దేవాలయాలపై దాడులు చేస్తూ రాజకీయం చేస్తుంటాడు.ఆ రాజకీయ నాయకుడి భరతం పట్టడానికి అఖండ మళ్ళీ జనం లోకి వస్తాడు. స్టోరీ లైన్ అదిరిపోయింది, ఇక ఈ బోయపాటి శ్రీను ఇలాంటి కథలో ఎలాంటి మాస్ సన్నివేశాలు పెడుతాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సరిగ్గా తీస్తే ఈ చిత్రం నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.