Samuthirakani: సినిమా ఇండస్ట్రీ లో నేడు గొప్ప స్థానం లో ప్రతీ ఒక్కరికి ఊరికే అలాంటి స్టార్ స్టేటస్ రాలేదు, దాని వెనుక వాళ్ళు చేసిన కృషి, పడిన కష్టాల వల్లే నేడు ఈ స్థానం లో ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు సముద్ర ఖని. ప్రస్తుతం సౌత్ లో ఈయన లేని సినిమా అంటూ లేదు, ప్రతీ చిత్రం లో ఆయన ఎదో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించాల్సిందే, అది తప్పనిసరి అయిపోయింది.ఈ రేంజ్ కి ఆయన చేరుకోవడానికి పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
పేదరికం లో పుట్టి పెరిగిన సముద్ర ఖని కి , సినిమాల్లోకి అడుగుపెట్టాలని మొదటి నుండి ఆసక్తి ఉండేది. ఆ పట్టుదలతోనే ఆయన చెన్నై కి వచ్చాడు. కాళ్ళు అరిగిపోయ్యే రేంజ్ లో స్టూడియోల చుట్టూ అవకాశాల కోసం తిరిగేవాడు. ఉండడానికి ఎక్కడా చోటు లేకపోతే ఫుట్ పాత్ మీదనే పడుకునే వాడు, అంత కఠిక దరిద్రాన్ని అనుభవించాడు ఆయన.
సినిమాల్లోకి రాకముందు తాత్కాలిక ఉద్యోగం కూడా దొరకక, చేతిలో ఉన్న డబ్బులు సరిపోక ఎన్నో పస్తులున్న రోజులను గడిపాడు సముద్ర ఖని. అలా సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూసిన ఆయనకీ ఒక రోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం దక్కింది. అలా మొదలైన సముద్ర ఖని కెరీర్,నేడు డైరెక్టర్ గా , నిర్మాతగా మరియు గొప్ప నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసే అవకాశం దక్కింది.
ఏ ఫుట్ పాత్ మీద అయితే ఆయన పడుకున్నాడో, ఆ ఫుట్ పాత్ పక్కనే ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, ప్రస్తుతం ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఇది కదా నిజమైన విజయం అంటే, ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ కి దర్శకత్వం చేస్తున్నాడు. ఈ సినిమా జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.