
Chiranjeevi-Mohan Babu: మోహన్ బాబు, చిరంజీవి జర్నీ ఇప్పటిది కాదు, దాదాపు ముప్పై ఐదేళ్ళ క్రితం బంధం అది. అందుకే, ఇద్దరు మధ్య స్టార్ డమ్ పరంగా చాలా వ్యత్యాసం ఉన్నా.. దగ్గర చనువు ఉంది. పైగా చిరంజీవి అని పేరు పెట్టి పిలుచుకునే చనువు అది. మధ్యలో ఎన్నో గొడవలు జరిగినా.. మోహన్ బాబు పబ్లిక్ గా చిరు పై విమర్శలు చేసినా.. చిరు మనసులో ఏమి పెట్టుకోలేదు. కారణం స్నేహం.
మోహన్ బాబుతో ఉన్న సుదీర్ఘ స్నేహం కారణంగా చిరంజీవి కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు వెళ్లిపోయారు. పైగా మోహన్ బాబుకి సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కొన్నాళ్ళు దూరంగా ఉన్నా.. మళ్ళీ కలిసిపోతూ వచ్చారు. కానీ ఈ సారి కలుస్తారా ? కలిసే అవకాశం ఉందా ? అంటే కష్టమే అని తెలుస్తోంది. నిజానికి ఈ కరోనా కాలంలో మోహన్ బాబు, చిరంజీవి కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లారు.
పైగా వాళ్లిద్దరే వెళ్లలేదు. తమ కుటుంబాలతో సహా మినీ వెకేషన్ అనే పేరు పెట్టుకుని సరదాగా గడిపి వచ్చారు. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు, అంతలోనే ఇద్దరి మధ్య బాగా దూరం పెరిగిపోయింది. చిరంజీవి ఇగోను మోహన్ బాబు హర్ట్ చేశారు. దీనికితోడు ‘మా’ ఎన్నికల సమయంలో మోహన్ బాబు, నరేష్ తో కలిసి చేసిన రచ్చ పై చిరంజీవి కోపంగా ఉన్నారు.
తన మనసు విరిగేలా మోహన్ బాబు, నరేష్ ప్రవర్తన ఉంది అని చిరు ఫీల్ అయ్యారు. అందుకే ఇక ‘మంచు’ హీరోలకు దూరంగా ఉండాలని చిరంజీవి ఫిక్స్ అయ్యారట. మరి చిరంజీవి నిజంగానే మోహన్ బాబు ఫ్యామిలీకి దూరంగా ఉంటారా ? లేకపోతే ఎప్పటిలానే స్నేహం అంటూ మోహన్ బాబుతో కలిసి పోతారా ? చూడాలి.
ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే, మెగాస్టార్ క్యాంప్ ఇక నుంచి మోహన్ బాబు, నరేష్ లను దూరం పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నరేష్ పట్ల చిరంజీవి చాలా కోపంగా ఉన్నారని.. అతనికి ఎంత దూరం జరిగితే అంత మంచిది అని చిరంజీవి భావిస్తున్నారట.