https://oktelugu.com/

Kanguva Trailer : కంగువ సినిమా ట్రైలర్ ను మిస్ లీడ్ చేస్తున్న డైరెక్టర్…కారణం ఏంటి..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలేవి కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అయితే సాధించడం లేదు. తెలుగు, కన్నడ సినిమాలు భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే తమిళ్ హీరోలు మాత్రం పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను కొట్టలేకపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 13, 2024 / 10:45 AM IST

    Kanguva Trailer

    Follow us on

    Kanguva Trailer : సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో వస్తున్న కంగువ సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ మొత్తం విజువల్స్ తో నిండిపోయింది. ఇక శివ ఈ సినిమాతో తనను తాను ఒక వైవిద్యమైన దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. రజనీకాంత్ తో చేసిన ‘అన్నతై’ సినిమా ఫ్లాప్ అవడంతో రోటీన్ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన శివ భారీ వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యం తో ఒక పిరియాడికల్ డ్రామా సినిమాని తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ కంగువ సినిమాకి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ కంగువ సినిమా ట్రైలర్ కనక మనం ఒకసారి చూసినట్లైతే ఇందులో భారీ వైవిధ్యాన్ని కనబరుస్తూ విజువల్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ విజువల్స్ అన్ని గందరగోళంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిజానికి బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటించాడు. కానీ అతని పాత్రలో జీవమైతే మనకు కనిపించడం లేదు. డైలాగులు లేకుండా మెప్పించిన బాబీ డియోల్ ఈ సినిమాలో భారీ డైలాగులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన పాత్ర మాత్రం ప్రేక్షకుడిని ఏమాత్రం ఆకట్టుకునే విధంగా కనిపించడం లేదు.

    అలాగే ఈ సినిమాని పిరియాడికల్ డ్రామాగా ప్రచారం చేస్తూ వస్తున్నప్పటికీ కొన్ని నిమిషాల పాటు పిరియాడికల్ గా కనిపిస్తుందని ఆ తర్వాత ఆధునిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా ఉంటుందని ప్రొడ్యూసర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ మొత్తానికైతే ట్రైలర్ లో మాత్రం ప్రియాడికల్ కి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే హైలెట్ చేస్తూ సినిమాని రూపొందించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దిశాపటాని ట్రైలర్ లో అసలు ఎక్కడ కనిపించకపోవడం విశేషం…ఇక ఇదిలా ఉంటే దర్శకుడు ఆడియన్స్ ను మిస్లీడ్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది.

    ఎందుకంటే ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుందని చెబుతూ ఆ పాయింట్ ఆఫ్ వే లోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసి ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఈ సినిమా ఉండబోతుంది అంటూ మరొక హింట్ ఇస్తున్నారు. ఒక విధంగా ఇదంతా ముందే ప్రీ ప్లాన్ చేసుకొని పబ్లిసిటీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సినిమా రిలీజ్ కి ముందే వీటికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తే పర్లేదు లేకపోతే మాత్రం సినిమా భారీగా నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి.

    ఎందుకంటే ఆడియన్ పీరియాడికల్ డ్రామాని ఎక్స్ పెక్ట్ చేసి థియేటర్ కి వస్తే అక్కడ ఆధునిక ప్రపంచానికి సంబంధించిన సినిమాలు చూపిస్తే మాత్రం వాళ్ళు తీవ్రంగా నిరాశ పడతారు. దానివల్ల సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది… మరి ఇప్పటికైనా దర్శకుడు ఈ సినిమా మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ సినీ విమర్శకులు సైతం దర్శకుడు శివకి సలహాలిస్తున్నారు…