https://oktelugu.com/

Donald Trump: బైడెన్‌ తప్పుకున్నాడా… తప్పించారా.. సంచలన విషయాలు చెప్పిన డొనాల్డ్‌ ట్రంప్‌!

అమెరికా అధ్యక్షన్నికలకు గడువు సమీపిస్తోంది. పోటీలో ప్రధాన పార్టీలు డెమొక్రటిక్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీ తరఫున కమలా హ్యారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌ తలపడుతున్నారు. ప్రచారం ముమ్మరం చేశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 13, 2024 / 10:56 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు నాలుగు నెలలే సమయం ఉంది. ఈమేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటరు నమోదు వేగవంతమైంది. అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ బరిలో ఉన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. ఎన్నిలకు సమయం దగ్గర పడుతుండంతో రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సర్వేలు కూడా జోరుగా జరుగుతున్నాయి. సర్వేలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ ఉన్నప్పుడు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ లీడ్‌లో ఉన్నారు. సర్వే సంస్థలన్నీ ట్రంప్‌కే మెజారిటీ ఇచ్చాయి. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ అంగతకుడు జరిపిన కాల్పుల ఘటన తర్వాత బైడెన్‌ మరింత బలహీనపడ్డాడు. ట్రంప్‌కు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. గతంలో ట్రంప్‌ పాలన చూసిన ప్రజలు ఆయనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, కాల్పుల ఘటన అమెరికన్లను ఆయనవైపు తిప్పింది. దీంతో ట్రంప్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న తరువాత ఆయన దేశవ్యాప్తంగా ర్యాలీలను ముమ్మరం చేశారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు.

    ఎన్నికల వేడి షురూ..
    ఈ ఏడాది నవంబర్‌/డిసెంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. మూడోసారి బరిలో దిగారు. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ఎదుర్కొంటున్నారు. బైడెన్‌ పోటీ నుంచి తప్పుకున్నాక కమలా రేసులోకి వచ్చారు. క్రమంగా ఆమె కూడా ప్రచార జోరు పెంచుతున్నారు. ట్రంప్‌కు దీటుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రేసు నుంచి తప్పుకోవడంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ప్రత్యేక ఇంటర్వ్యూ…
    అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ అపర కుబేరుడు, టెస్లా అధినేత, టాప్‌ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది– మస్క్‌ అధికారిక హ్యాండిల్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతోంది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్‌. పెన్సిల్వేనియా బట్లర్‌ ప్రాంతంలో జరిగిన ప్రాణాంతక దాడి, 2019 ఎన్నికల్లో ఓటమి, ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం, ఇజ్రాయెల్‌– పాలస్తీనా మధ్య తలెత్తిన సంక్షోభ పరిస్థితులు, భారత్‌తో ఉన్న సంబంధాలు, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ పరిపాలన, అఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం, సిరియా.. వంటి అంశాలపై ట్రంప్‌ స్పందించారు.

    చెత్త అధ్యక్షుడు..
    అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు జో బైడెన్‌ అని ట్రంప్‌ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడానికి జో బైడెనే ప్రధాన కారకుడని ఆరోపించారు. బైడెన్‌ లేకపోయివుంటే రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం సంభవించి ఉండేదే కాదని తేల్చి చెప్పారు. తన హయాంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సత్సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు.

    రేసు నుంచి తప్పుకోవడం వెనుక కుట్ర..

    జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం వెనుక భారీ కుట్ర ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ అంచనా వేశారు. ఆయనను బలవంతంగా తప్పించారని విమర్శించారు. తనతో ఇప్పటివరకు జరిగిన పబ్లిక్‌ డిబేట్లల్లో బైడెన్‌ వెనుకంజలో ఉన్నాడని తెలిపారు. వృద్ధాప్యం కారణంతో ఆయనను పక్కనపెట్టారని వ్యాఖ్యానించారు.