Nani: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య భారీ పోటీ అయితే నెలకొంది. ఇక నాచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నాని సైతం ఇప్పుడు తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం మాస్ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న నాని ఇకమీదట చేయబోతున్న ప్రతి సినిమాతో ఏదో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే టైర్ వన్ హీరోల మధ్య విపరీతమైన పోటీ నడుస్తున్న క్రమంలో టైర్ 2 హీరోల మధ్య కూడా చాలా టైట్ కాంపిటీషన్ అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో నానితో పాటు విజయ్ దేవరకొండ కి చాలా మంచి పోటీ అయితే నెలకొంది.
Also Read: ‘మిరాయ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ..సినిమాలో ప్లస్సులు,మైనస్సులు ఇవే!
నాని చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సెకండ్ హీరోగా నటించిన విజయ్ దేవరకొండ తర్వాత కాలంలో హీరోగా మారి పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో గొప్ప విజయాలను సాధించాడు. మరి ఇప్పుడు ఆయన టైర్ వన్ హీరో రేంజ్ కి చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన కింగ్ డమ్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు.
కానీ ఆ సినిమా కనక సూపర్ సక్సెస్ ను సాధిస్తే టైర్ వన్ హీరో పొజిషన్ ని అందుకునే వాడు. మరి ఇలాంటి సందర్భంలో నాని, విజయ్ దేవరకొండల ఇద్దరిలో ఎవరు టైర్ వన్ పొజిషన్ ని దక్కించుకుంటారు అనేది ఇప్పుడు చర్చ నీయంశంగా మారింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న ప్యారడైజ్ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. కాబట్టి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడానికి రెడీ అవుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోల సినిమాలు మాత్రమే గుర్తుకొస్తున్నాయి. మరి టైర్ 2 హీరోలు కూడా టాప్ పొజిషన్ ని అందుకునే పరిస్థితి అయితే నెలకొంది. మరి ఇలాంటి సందర్భాన్ని బాగా వాడుకొని వీలైనంత తొందరగా స్టార్ హీరోలుగా అవతరించాలనే ప్రయత్నంలో వీళ్ళిద్దరూ ఉన్నారు…చూడాలి మరి వీళ్లలో ఎవరు టాప్ పొజిషన్ ను చేరుకుంటారు అనేది…